OTT Movies: మూవీ లవర్స్ కి పండగ.. ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. లిస్ట్ ఇదే!

ఈ వారం ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. మదగజరాజ, రాచరికం, మహిష సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగా.. పోతుగడ్డ, ఐడెంటిటీ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.

New Update

OTT Movies: సంక్రాంతికి విడుదలైన సినిమాల సందడి  థియేటర్స్ లో ఇంకా కొనసాగుతుండగానే.. ఈ వారం మరికొన్ని సినిమాలు, సీరీస్ లు ఓటీటీ, థియేటర్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

ఈ వారం ఓటీటీ, థియేటర్  సినిమాలు 

మదగజరాజ

హీరో విశాల్, వరలక్ష్మి శరత్‌కుమార్‌, అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మదగజరాజ'. దాదాపు 12 ఏళ్ళ క్రితమే పూర్తయిన ఈ సినిమా ఇప్పుడు విడుదలవుతోంది. తమిళ్ లో ఇప్పటికే రిలీజైన ఈ చిత్రం ఈ నెల 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్ యాక్షన్ అవతార్, కామెడీ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. 

ఐడెంటిటీ 

మలయాళం సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్  'ఐడెంటిటీ' ఈనెల 31 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. త్రిష, టొవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

రాచరికం

సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో విజయ్‌ శంకర్, వరుణ్ సందేశ్, అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రాచరిక. ఈ మూవీ జనవరి 31న థియేటర్స్ లో విడుదల కానుంది. 

మహిష

కె.వి.ప్రవీణ్ దర్శకత్వంలో యషిక, బిగ్ బాస్ ఫేమ్ పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక నటించిన లేటెస్ట్ మూవీ మహిష. ఈ మూవీ కూడా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

పోతుగడ్డ

రక్ష వీరమ్ దర్శకత్వంలో  విస్మయ శ్రీ , శత్రు, ఆడుకాలం నరేన్, పృథ్వీ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ పోతుగడ్డ. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలవుతోంది. జనవరి 30 నుంచి ఈ చిత్రం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. 

Also Read: SSMB29 Movie: హీరోతో సహా అందరికీ ఈ షరతులు వర్తిస్తాయి: రాజమౌళి మాస్ వార్నింగ్!

Advertisment
Advertisment