/rtv/media/media_files/2025/01/28/dqFzznWxMXwrdkONj5wa.jpg)
Brahmaputra River
325 టీఎంసీల నీటిని నిల్వచేసే రిజర్వాయర్‌ను బ్రహ్మాపుత్రా నది మీద కట్టాలని డిసైడ్ అయింది భారత ప్రభుత్వం. చైనా సరిహద్దులకు కాస్త దిగువకు ఈ ప్రాజెక్టను నిర్మించనుంది. నిజానికి ఈశాన్య రాష్ట్రాల్లో అంతపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని వలన ఇక్కడి పర్యావరణం భారీగా దెబ్బతినే అవకాశం ఉంది. కానీ.. ఎగువన చైనా నిర్మిస్తున్న మరో అతి పెద్ద జల విద్యుత్ కేంద్రం నుంచి దిగువన బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో ఎదురయ్యే ముప్పు నుంచి కాచుకోవాలంటే ఈ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించక తప్పడం లేదని చెబుతోంది భారత ప్రభుత్వం.
Also Read: ISRO: సెంచరీ కొట్టనున్న ఇస్రో..రేపే ప్రయోగం
వాటర్ బాంబ్ ను తట్టుకోవడానికే..
ఎగువన చైనా రిజర్వాయర్ ను బాటర్ బాంబ్ గా పరిగణిస్తున్నారు. చైనా నిర్మిస్తున్న రిజర్వాయర్లో 194 టీఎంసీలను నిలువ చేయవచ్చు. దీనిపై 60 వేల మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. దీనిని కేవలం జలవిద్యుత్ కోసమే అని ఆ దేశం చెబుతోంది. అయితే ఎప్పుడైని ఇరు దేశాలకు మధ్యనా సంబంధాలు చెడిపోతే..ఈ డ్యాం గేట్లను చైనా ఎత్తేస్తే...అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు మునిగిపోతాయి. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికే భారత ప్రభుత్వం ఇప్పుడు బ్రహ్మాపుత్రా నది మీద రిజర్వాయర్ ను కట్టేందుకు సిద్ధమైంది. పరాంగ్ అనే ప్రాంతంలో ఈ ఈ రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు. ఇది 325 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం కలదిగా ఉంటుంది. చైనా ఒకేసారి తన డ్యామ్ ను ఖాళీ చేసినా కూడా భారత్ నిర్మిస్తున్న జలాశయం దానిని తట్టుకోగలదు.
ప్రపంచంలోనే అతిపెద్ద జలాశయం..
గత నెల ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యు్త్ డ్యామ్‌ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. త్రీగోర్జెస్ డ్యామ్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఈ డ్యామ్‌ను నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ సరిహద్దుకు సమీపంలోని టిబెట్ ప్రాంతంలో ఈ డ్యామ్‌ను నిర్మించనుంది. మొత్తం 137 బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్‌ఫ్రా ప్రాజెక్టుగా ఈ డ్యామ్ నిలుస్తుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. హిమాలయాల్లోని బ్రహ్మపుత్ర నది యూటర్న్ అరుణాచల్‌ప్రదేశ్, అసోం గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. సరిగ్గా ఆ యూటర్న్ ఉన్న చోటనే చైనా ఈ డ్యామ్ను నిర్మిస్తోంది. బ్రహ్మపుత్రా నదీ జలాల ప్రవాహం, పంపిణీకి సంబంధించిన వివిధ అంశాలపై భారత్-చైనా మధ్య ఒప్పందం జరిగింది. వర్షాకాలంలో ఈ నదికి ఎక్కువగా వరదలు వస్తుంటాయి. ఇరుదేశాల మధ్య ఒప్పంద ప్రకారం మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర నీటిని రెండు దేశాలు పంచుకోవాల్సి ఉంది.
లక్షల మంది చనిపోతారు...
అయితే చైనా ఈ వాటర్ డ్యామ్ నిర్మించడంపై భారత్ లో పలు రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ , అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండూలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అత్యవసర పరిస్థితుల్లో చైనా దానిని ‘వాటర్ బాంబ్’గా వినియోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. అంత పెద్ద ప్రాజెక్టును నిర్మిస్తే సియాంగ్, బ్రహ్మపుత్ర పరిసర ప్రాంతాలపై భారీ ప్రభావం చూపడంతోపాటు అతిపెద్ద ముప్పుగా మారనుంది. ఒకవేళ దీన్ని వాటర్ బాంబ్ గా వాడితే సియాంగ్ బెల్ట్ లో ఉన్న ఒక గిరిజన తెగ మొత్తం అదృశ్యమౌతుందని పెమా ఖండూ అన్నారు. అస్సాంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. బంగ్లాదేశ్ వరు దీని ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు.
Also Read: Bengaluru: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడితో పాటూ మరో 17మందిపై ఎస్టీ అట్రాసిటీ కేసు