Gulf of Mexico: గూగుల్‌ మ్యాప్స్‌లో మారిన గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరు..కానీ అక్కడ మాత్రం!

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గూగుల్‌ మ్యాప్స్‌ ఇకపై గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా చూపించనుంది. ఈ నెల 25న గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును మార్చుతూ అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

New Update
trump

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును గూగుల్‌ మ్యాప్స్‌ ఇకపై గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా చూపించబోతుందని తెలుస్తుంది. ఈ నెల 25న గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును మార్చుతూ అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గూల్స్‌ మ్యాప్స్‌లో కూడా మార్పులు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటన చేసింది. అయితే ఇది అమెరికాలోని వినియోగదారులకు మాత్రమే కనిపిస్తుందని వెల్లడించింది.

Also Read: Mauni Amavasya 2025: మూడు గ్రహాల కలయికతో మౌని అమావాస్య.. ఈ నాలుగు రాశుల వారికి అన్నీ శుభాలే!

 ప్రపంచ వ్యాప్తంగా అది గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోగానే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానాల ప్రకారం పేర్ల మార్పునకు సంబంధించి తమకు స్పష్టమైన విధానం ఉందని వివరించింది. ట్రంప్‌ ఆదేశాల మేరకు గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో ఇప్పుడు అధికారికంగా గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మారిందని ట్రంప్‌ కార్యవర్గం గత శనివారం ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా అమెరికాలోని ఎత్తయిన అలస్కన్‌ శిఖరం డెనాలిని మౌంట్‌ మెకిన్లీగా మార్చినట్లు వివరించింది.

Also Read: Arunachal Pradeh: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్

ఈ మార్పులు అమెరికా అసాధారణ వారసత్వాన్ని కాపాడటంతోపాటు గల్ఫ్‌ ఆఫ్‌ ఆమెరికా చరిత్రను భవిష్యత్‌ అమెరికన్లు సంబరంగా జరుపుకుంటారని పేర్కొంది. ఉత్తర అమెరికాలో దాదాపు ఆరు లక్షల చదరపు మైళ్ల సుముద్రాన్ని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోగా వ్యవహరిస్తారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఈ ప్రదేశం ప్రపంచంలోనే 9వ అతిపెద్ద జలవనరుగా ఉంది.

తొలిసారి ఈ పేరును 16వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన అన్వేషకులు వాడుకలోకి తెచ్చారు. అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్య సంపద ఇక్కడే లభిస్తుంది. కాగా, గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరు మార్పును తొలి నుంచి మెక్సికో వ్యతిరేకిస్తున్నది.ఇక, అలస్కా శిఖరాన్ని గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం మెకిన్లీ గౌరవార్థం మౌంట్‌ మెకిన్లీ అని పిలిచేవారు. ఆ తర్వాత 1975లో రాష్ట్ర అభ్యర్థన మేరకు దానిని డెనాలిగా మార్పు చేశారు. 

Also Read: Bengaluru: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడితో పాటూ మరో 17మందిపై ఎస్టీ అట్రాసిటీ కేసు

Also Read: Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం

Advertisment
తాజా కథనాలు