/rtv/media/media_files/2025/04/14/CEnsWUe12nYgRD57Yp9b.jpg)
Vivo T4 5G
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన లైనప్‌లో ఉన్న మరో స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Vivo T4 5G స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో భారత దేశంలో లాంచ్ చేయనుంది. ఇది పెద్ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. T4 5G స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ఉండవచ్చు. కంపెనీ తాజాగా ఆ ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసింది.
Vivo T4 5G
వివో కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లోని ఒక పోస్ట్ రిలీజ్ చేసింది. T4 5G భారతదేశంలో ఏప్రిల్ 22న లాంచ్ అవుతుందని వెల్లడించింది. దాని ప్రమోషనల్ పోస్టర్‌లో.. ఈ స్మార్ట్‌ఫోన్ వృత్తాకార వెనుక కెమెరా యూనిట్‌తో కనిపిస్తుంది. దీనికి రెండు కెమెరాలు, ఒక LED లైట్ ఉన్నాయి. ఇది గ్రీన్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా స్లిమ్ బెజెల్స్‌తో కూడిన క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
అదే సమయంలో ముందు కెమెరా కోసం మధ్యలో హోల్-పంచ్ స్లాట్‌ను అందించారు. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌లు దాని రైట్‌సైడ్ అందించారు. ఇది ఈ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇ-స్టోర్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా సేల్‌కు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కి సంబంధించిన ఫీచర్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈ T4 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల పూర్తి AMOLED క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అందించారు. దీనిలో ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 అందించే అవకాశం ఉంది. సేఫ్టీ కోసం స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. T4 5Gలో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ కెమెరాను అందించే అవకాశం ఉంది.
vivo T4 5G launching on April 22nd in India. pic.twitter.com/qvy6QlAqNm
— Mukul Sharma (@stufflistings) April 14, 2025
Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!
ఇటీవల రిలీజైన V50e
ఇదిలా ఉంటే ఇటీవలే వివో భారతదేశంలో V50e ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. కంపెనీ ఫిబ్రవరిలో V50ని ప్రవేశపెట్టింది. 8 GB RAM -128 GB స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్ ధర రూ.28,999, 8 GB + 256 GB ధర రూ. 30,999గా ఉంది. ఇది ఏప్రిల్ 17 నుండి ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఈ-స్టోర్ల ద్వారా సేల్‌కు అందుబాటులో ఉంది.
vivo-mobiles | new-smartphone | new-smart-phone | latest-telugu-news | telugu-news
Follow Us