/rtv/media/media_files/2025/04/14/iGlsVdpzCR2bRfSpbXZw.jpg)
KH 237
KH 237: లెజెండరీ యాక్టర్ కమల్‌హాసన్(Kamal Haasan) జెట్ స్పీడ్ లో సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’(Thug Life) సినిమాను పూర్తి చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే థగ్ లైఫ్ పూర్తి చేసిన వెంటనే కమల్ మరో సరికొత్త ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
‘కెహెచ్ 237’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందబోయే ఈ చిత్రం ద్వారా ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బు-అరీవు దర్శకులుగా తొలి అడుగులు వేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కమల్ తన స్వంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ జూలై లేదా ఆగస్టు నుండి స్టార్ట్ అవ్వనున్నట్లు టాక్.
Also Read: కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
సన్నని లుక్ లో కమల్‌హాసన్
పూర్తిగా యాక్షన్ అండ్ అడ్వెంచర్ నేపథ్యంలో నడిచే భారీ డ్రామాగా ఈ మూవీ రూపొందనుంది. పాత్ర డిమాండ్‌కు అనుగుణంగా కమల్ తన ఫిజిక్‌లో మార్పులు తీసుకొస్తున్నారని సమాచారం. ఆయన ప్రస్తుతం బరువు తగ్గేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, సన్నని లుక్ కోసం శరీరాకృతిని మలచుకుంటున్నారని సమాచారం.
Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, అన్బు- అరీవు కలయిక గతంలో విక్రమ్ చిత్రంలో కమల్‌తో కలిసి పని చేశారు. ఆ సినిమాలో వారి యాక్షన్ కొరియోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు అదే జోడీ కమల్‌కి దర్శకులుగా పని చేయబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ‘కెహెచ్ 237’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి!