/rtv/media/media_files/2025/04/14/NRoRipiZdSBU8DKjuCdw.jpg)
Prabhas Spirit
Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ కొత్త అవతారంలో అభిమానుల ముందుకు రానున్నారు. ఆయన తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సినిమా ‘స్పిరిట్’. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యాంగర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన అర్జున్ రెడ్డి అప్పట్లో సంచలనం సృష్టించింది. సందీప్ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన అనిమల్ రెండు తెలుగు, హిందీ, బాషలలో కూడా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ప్రభాస్ తో తీసే ఈ 'స్పిరిట్' మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read: కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
అక్టోబర్ 2025లో ఫుల్ ఫ్లెడ్జ్ షూటింగ్
ఈ యాక్షన్ డ్రామాను అక్టోబర్ 2025లో సందీప్ ఫుల్ ఫ్లెడ్జ్ షెడ్యూల్‌తో షూటింగ్‌ను ప్రారంభించబోతున్నాడట. అంటే అక్టోబర్ నుంచి ప్రభాస్ అధికారికంగా పోలీసాఫీసర్‌గా డ్యూటీలో ఉండనున్నారు. మునుపెప్పుడు ప్రభాస్ పోలీస్ పాత్ర చేయకపోవడంతో అభిమానులకు ఇది నిజంగా ఒక కొత్త అనుభూతిని కలిగించే పాత్ర కానుంది.
Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
ఇదిలా ఉండగా, మ్యూజిక్ పార్ట్‌పై కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నారు. అదే సమయంలో, చిత్రానికి కావలసిన ప్రధాన లొకేషన్ల ఎంపికలో సందీప్ వంగా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన మెక్సికోకి వెళ్లి, అక్కడ ఓ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించే యోచనలో సందీప్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..
టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో పాటు ప్రణయ్‌రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం 2027లో థియేటర్లలో విడుదల అయ్యే అవకాశముంది.
Also Read: 'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి