/rtv/media/media_files/2025/09/12/samsung-galaxy-z-flip-7-5g-offer-2025-09-12-07-04-45.jpg)
Samsung Galaxy Z Flip 7 5G Offer
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శామ్‌సంగ్‌కు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తరచూ తన కొత్త మొబైళ్లలో అధునాతన ఫీచర్లు అందించి వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది. అదే సమయంలో తన ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించి మరింత మందిని ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఫోన్‌పై అదిరిపోయే తగ్గింపు అందించింది.
Samsung లేటెస్ట్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. Samsung Galaxy Z Flip 7 5G ఫోన్ పై భారీ తగ్గింపు అందిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ Flipkartలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ Samsung Galaxy Z Flip 7 5G డ్యూయల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇప్పుడు ఈ Galaxy Z Flip 7 5G పై అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, డిస్కౌంట్లు, ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : Iphone 17 Series: ఆ ప్రాంతాల్లో Iphone 17 చాలా చీప్ గురు.. ఎందుకో తెలుసా?
Samsung Galaxy Z Flip 7 5G Offers
ఫ్లిప్‌కార్ట్ Samsung Galaxy Z Flip 7 5G స్మార్ట్‌ఫోన్‌లోని 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ పై భారీ తగ్గింపు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Samsung Galaxy Z Flip 7 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.1,09,999 కి లిస్ట్ అయింది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల చెల్లింపుపై రూ.12,000 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత Samsung Galaxy Z Flip 7 5G స్మార్ట్‌ఫోన్ రూ.97,999కి అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఇస్తే రూ.41,350 వరకు తగ్గించవచ్చు. ఈ ఆఫర్ మొత్తం వర్తిస్తే Samsung Galaxy Z Flip 7 5G మొబైల్‌ను కేవలం రూ.56,649లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తించుకోవలసిన విషయం ఏంటంటే.. ఇంత పెద్ద మొత్తంలో ఎక్సేంజ్ ఆఫర్ పొందాలంటే.. పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. లేటెస్ట్ మోడల్ అయితే ఇంకా బెటర్.
Samsung Galaxy Z Flip 7 5G Specs
Samsung Galaxy Z Flip 7 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.9-అంగుళాల ఫుల్ HD + డైనమిక్ AMOLED 2X ప్రైమరీ డిస్‌ప్లే ఉంది. ఇది 2520x1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 1Hz-120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. అదే సమయంలో 4.1-అంగుళాల సూపర్ AMOLED కవర్ డిస్‌ప్లే అందించారు. ఇది 1048x948 పిక్సెల్‌ల రిజల్యూషన్, 60/120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ UI 8పై పనిచేస్తుంది. అదే సమయంలో ఇది పనితీరు కోసం Exynos 2500 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ Galaxy Z Flip 7 5G ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP48 రేటింగ్‌ను కలిగి ఉంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. Galaxy Z Flip 7 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 10-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,300mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, LTE, Wi-Fi 7, బ్లూటూత్ v5.4 ఉన్నాయి.
Also Read : 5000ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!