New Update
/rtv/media/media_files/2025/05/13/tuIbIpX1eLhlEjLinBUs.jpg)
Samsung Galaxy S25 Edge
Samsung Galaxy S25 Edge: శామ్సంగ్ తన గెలాక్సీ ఎస్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. అత్యంత సన్నని Samsung Galaxy S25 Edge ఫోన్‌ను విడుదల చేసింది. ఇది 5.8mm మందం, 163 గ్రాముల బరువుతో వచ్చింది. ఈ ఫోన్ 6.7-అంగుళాల 2K క్వాడ్ HD+ LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1Hz నుండి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇప్పుడు దీని ధర, స్పెసిఫికేషన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
Samsung Galaxy S25 Edge Priceగెలాక్సీ ఎస్25 ఎడ్జ్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. అందులో 12GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ.93,400గా ఉంది. అదే సమయంలో 12GB + 512GB వేరియంట్ ధర సుమారు రూ. 1,03,600గా కంపెనీ నిర్ణయించింది. ఇవన్నీ గ్లోబల్ వేరియంట్ ధరలు. ఈ ఫోన్ టైటానియం సిల్వర్, టైటానియం జెట్‌బ్లాక్, టైటానియం ఐసీబ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. భారతదేశంలో దీని ధర త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లో దీని సేల్ మే 30 నుండి ప్రారంభమవుతుంది. చాలా మార్కెట్లలో నేటి నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
Samsung Galaxy S25 Edge Specifications
Samsung Galaxy S25 Edge ఫోన్ Android 15-ఆధారిత One UI 7 పై నడుస్తుంది. ఈ ఫోన్ 7th జెన్ OS అప్‌గ్రేడ్‌లు, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్‌ను పొందుతుంది. 6.7-అంగుళాల Quad HD+ LTPO AMOLED డిస్‌ప్లేను పొందుతుంది. 1Hz నుండి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ద్వారా శక్తిని పొందుతుంది.Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
Samsung Galaxy S25 Edge ఫోన్ OIS, 2x ఆప్టికల్ క్వాలిటీ జూమ్‌తో 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరాతో పాటు 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ అందించారు. ఫోన్ ముందు భాగంలో 12MP షూటర్ ఉంది. ఈ కెమెరా 8K 30fps, 4K 60fps రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.Also Read: ఆపరేషన్ సిందూర్‌ను ఆపలేదు.. ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన!
Samsung Galaxy S25 Edge ఫోన్ ఇతర S-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే AI ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో సర్కిల్ టు సెర్చ్, కాల్ ట్రాన్స్క్రిప్ట్, రైటింగ్ అసిస్ట్, డ్రాయింగ్ అసిస్ట్ వంటి AI టూల్స్ ఉన్నాయి. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్, Qi వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్‌కు మద్దతుతో 3900mAh బ్యాటరీని కలిగి ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
Also Read: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
tech-news | telugu tech news | tech-news-telugu | latest-telugu-news | samsung-galaxy
తాజా కథనాలు