/rtv/media/media_files/2025/05/27/ErbKLlMTxZ7bATpCKrZV.jpg)
ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్ మి మూడు మోడళ్లను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. Realme GT 7, Realme GT 7T, Realme GT 7 డ్రీమ్ ఎడిషన్‌లను ఇవాళ రిలీజ్ అయ్యాయి. కొత్త GT సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు MediaTek Dimensity చిప్‌సెట్‌లతో వస్తాయి. 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ యూనిట్లను కలిగి ఉంటాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన ధర, ఫీచర్లు తెలుసుకుందాం.
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!
Realme GT 7 Price
8 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 39,999.
12 జిబి ర్యామ్ + 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 42,999.
12 జిబి ర్యామ్ + 512 జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 46,999 గా ఉంది. ఇది ఐస్సెన్స్ బ్లాక్, ఐస్సెన్స్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది.
Realme GT 7 Specifications
Realme GT 7 ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పై నడుస్తుంది. 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఆక్టా-కోర్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌పై నడుస్తుంది. భారతదేశంలో కొత్త MediaTek Dimensity 9400e ప్రాసెసర్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ Realme GT 7. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని ప్యాక్ చేసింది.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Realme GT 7T Price
8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 34,999.
12GB+256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 37,999.
12GB+512GB RAM స్టోరేజ్ మోడల్ ధర రూ. 41,999గా ఉంది. ఇది IceSense Black, IceSense Blue, Racing Yellow కలర్‌లలో విడుదలైంది.
Realme GT 7T Specifications
ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 6.80-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 8400-Max చిప్‌సెట్‌తో అమర్చబడి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తుంది.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
Realme GT Dream Edition
16GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 49,999గా ఉంది. ఇది ఆస్టన్ మార్టిన్ రేసింగ్ గ్రీన్ షేడ్‌లో లభిస్తుంది. ఈ మోడల్ సేల్ జూన్ 13 నుండి ప్రారంభమవుతుంది.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
Realme GT Dream Edition Specifications
GT 7 డ్రీమ్ ఎడిషన్‌ను ఆస్టన్ మార్టిన్ అరాంకో ఫార్ములా వన్ టీమ్‌తో కలిసి కంపెనీ రూపొందించింది. ఇది ఆస్టన్ మార్టిన్ సిగ్నేచర్ గ్రీన్ కలర్‌ను కలిగి ఉంది.
Realme GT series | latest-telugu-news | tech-news | telugu tech news | telugu-news