Realme 15X 5G: కొత్త ఫోన్ భలే భలే.. రియల్‌మీ పిచ్చెక్కించింది బ్రో - ఫీచర్లు హైక్లాస్..!

Realme 15X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఇది 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ.16,999 ప్రారంభ ధరగా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. లాంచ్ ఆఫర్‌లో రూ.1,000 బ్యాంక్ ఆఫర్ పొందొచ్చు.

New Update
Realme 15X 5G Price

Realme 15X 5G Price

ప్రముఖ స్మార్ట్‌ఫోన్(new-smartphone) తయారీ కంపెనీ Realme తన Realme 15 seriesలో తాజా స్మార్ట్‌ఫోన్ అయిన Realme 15X 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ Realme 15X 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB RAM + 10GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీనికి 7000mAh బ్యాటరీ అందించారు. ఇప్పుడు Realme 15X 5Gకి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read :  అదిరిపోయే వ్యాపారం.. ఇన్‌స్టాలో ఇలా చేస్తే.. నెలకు లక్షల లక్షల డబ్బు!

Realme 15X 5G Price

Realme 15X 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ Realme 15X 5G ఫోన్ ఆక్వా బ్లూ, మెరైన్ బ్లూ, మెరూన్ రెడ్ కలర్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక సైట్, మెయిన్‌లైన్ స్టోర్‌లలో సేల్‌కు అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 బ్యాంక్ ఆఫర్ లేదా రూ.2,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక సైట్‌లో రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఇంకా 6 నెలల పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను లభిస్తున్నాయి.

Also Read :  అమెజాన్‌లో జింగ్ జింగ్ ఆఫర్లు.. ల్యాప్‌టాప్‌లు వెరీ చీప్ బ్రో

Realme 15X 5G Specs

Realme 15X 5Gలో 6.8-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే, 1570×720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్‌తో ఆర్మ్ మాలి-G57 MC2 GPUతో వస్తుంది. Realme 15X 5G.. 6GB/8GB LPDDR4X RAM + 128GB/256GB UFS 2.2 స్టోరేజ్‌ను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ Android 15 ఆధారంగా Realme UI 6.0పై నడుస్తుంది.

కెమెరా సెటప్ విషయానికొస్తే.. Realme 15X 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Realme 15X 5G.. 60W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 + IP69 రేటింగ్ ఉంది. దీనితో పాటు ఇది మిలిటరీ-గ్రేడ్ మన్నిక కోసం MIL-STD 810H సర్టిఫికేషన్‌తో వస్తుంది.

Advertisment
తాజా కథనాలు