/rtv/media/media_files/2025/09/30/amazon-laptop-offers-2025-09-30-21-47-26.jpg)
Amazon Laptop offers 2025
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలతో సహా వివిధ ప్రొడెక్టులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కస్టమర్లు బ్యాంక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఎంపికలను నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు.
మీరు తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ కొనాలని ప్లాన్ చేస్తుంటే అమెజాన్ సేల్‌లో బెస్ట్ ఆప్షన్. ఈ సేల్‌లో ఏసర్, డెల్, HP వంటి బ్రాండ్‌ల ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అందువల్ల మీ బడ్జెట్ రూ. 40,000 కంటే తక్కువ ఉంటే.. మీరు 13వ తరం ఇంటెల్ కోర్ i3 లేదా రైజెన్ 5 ప్రాసెసర్, 16 GB RAM + 512 GB స్టోరేజ్‌తో ల్యాప్‌టాప్‌లను కొనుక్కోవచ్చు. ఇందులో Lenovo V15 G4 ల్యాప్‌టాప్‌ను రూ. 54,990కి బదులుగా రూ. 34,980కి కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 16 GB RAM +512 GB స్టోరేజ్‌తో AMD రైజెన్ 5 ప్రాసెసర్ ఉంది.
Amazon Laptop offers
ఈ సేల్‌లో కస్టమర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్లపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. ఈ సేల్ నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది.
HP 15 (Intel Core i3)
HP 15 (Intel Core i3) ల్యాప్‌టాప్ 12GB DDR4, 512GB SSD అసలు ధర అమెజాన్‌లో రూ.53,933 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.36,990లకే సొంతం చేసుకోవచ్చు.
Dell Vostro (Intel Core i3)
Dell Vostro (Intel Core i3) ల్యాప్‌టాప్ 16GB DDR4 RAM, 512GB అసలు ధర రూ.53,990 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.35,990లకే కొనుక్కోవచ్చు.
Acer Aspire Lite (AMD Ryzen 3)
అమెజాన్‌లో Acer Aspire Lite (AMD Ryzen 3)పై భారీ తగ్గింపు ఉంది. దీని అసలు ధర రూ.46,990 కాగా ఇప్పుడు రూ.26,990లకే కొనుక్కోవచ్చు.
Asus Vivobook 15 (Intel Core i3)
Asus Vivobook 15 (Intel Core i3) అసలు ధర రూ.51,990 కాగా ఇప్పుడు అమెజాన్‌లో రూ.33,990లకే సొంతం చేసుకోవచ్చు.
Lenovo V15 G4 (AMD Ryzen 5)
అమెజాన్‌లో Lenovo V15 G4 (AMD Ryzen 5) తక్కువకే పొందొచ్చు. దీని అసలు ధర రూ.54,900 కాగా ఇప్పుడు కేవలం రూ.34,980లకే లభిస్తుంది.
Dell 15 (Intel Core i3)
Dell 15 (Intel Core i3) బ్రాండ్2పై భారీ తగ్గింపు ఉంది. ఇది లాంచ్ సమయంలో రూ.49,518 ఉండగా.. ఇప్పుడు రూ.33,990 లకే దొరుకుతుంది.
ధర తగ్గింపు మాత్రమే కాకుండా వీటిపై భారీ బ్యాంక్ డిస్కౌంట్‌లు కూడా లభిస్తున్నాయి. అలాగే ఎక్స్ఛేంజ్ డిస్కౌంంట్‌లు రూ.వేలల్లో పొందొచ్చు.