/rtv/media/media_files/2025/10/01/instagram-2025-10-01-12-21-54.jpg)
ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు సోషల్ మీడియాతోనే జీవనం సాగిస్తున్నట్లు ఉంది. ఉదయం లేచినప్పటి నుంచి మళ్లీ నిద్రపోయే వరకు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్ అంటే పెద్దగా ఇన్కమ్ ఉండదని, ఏదో టైమ్ పాస్‌కు వాడుతారని చాలా మంది అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్ వల్ల నెలకు ఎన్నో లక్షలు సంపాదింవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియక రోజంతా ఊరికే రీల్స్ చూసి టైమ్ పాస్ చేస్తుంటారు. అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్ వల్ల డబ్బె ఎలా నెలకు డబ్బులు సంపాదించవచ్చు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: New Smartphone: తస్సాదియ్యా.. ఒప్పో కుమ్మేశాడు మావా.. కొత్త ఫోన్‌లో రచ్చ రచ్చ ఫీచర్లు!
సబ్‌స్క్రిప్షన్ ద్వారా లక్షలు..
ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ల ద్వారా నెలకు కొన్ని లక్షల డబ్బులు సంపాదించవచ్చు. అయితే అది కూడా ఒక స్పెషల్ కంటెంట్ ఉంటేనే కుదురుతుంది. ప్రస్తుతం చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా నెలకు దాదాపుగా 8 నుంచి 9 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఎలాగంటే.. కొందరు ప్రత్యేకమైన స్పెషల్ కంటెంట్ చేస్తుంటారు. వీటిని అందరికీ కనిపించేలా కాకుండా ప్రత్యేకమైన గ్రూప్ క్రియేట్ చేసి కేవలం సబ్‌స్క్రిప్షన్ ద్వారా కనిపించేలా పెట్టుకోవాలి. దీనివల్ల మీకు ప్రతీ నెల కొందరు సబ్‌స్క్రైబర్స్ వస్తారు. వారు ప్రతీ నెల కూడా సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే.. మీరు ఇన్‌కమ్ వస్తుంది. ప్రతీ నెలా సబ్‌స్క్రైబ్‌కి కొంత డబ్బులు అని మీరు పెట్టుకోవాలి.
ఇది కూడా చూడండి: Amazon Laptop offers: అమెజాన్‌లో జింగ్ జింగ్ ఆఫర్లు.. ల్యాప్‌టాప్‌లు వెరీ చీప్ బ్రో
ఉదాహరణకు మీరు ప్రతీ నెల సబ్‌స్క్రిప్షన్ కింద నెలకు రూ.400 పెట్టుకుంటే అవుతుంది. మీకు ఒక 1000 ఫాలోవర్స్ ఉంటే దాదాపుగా రూ.4 లక్షలు వస్తాయి. ఇలా మీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే అంత డబ్బులు వస్తాయి. మీకు ఫాలోవర్స్ పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే ఇలా సబ్‌స్క్రిప్షన్ చేయించాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫెషనల్ అకౌంట్ ఉండాలి. అలాగే 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. వీటితో పాటు ప్రాంతాల బట్టి 10 వేల ఫాలోవర్స్ ఉండాలి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ మానిటైజేషన్, కమ్యూనిటీ స్టాండర్ట్స్ పాటించాలి. అందరి పాలోవర్స్ కంటే స్పెషల్ కంటెంట్ ఇవ్వాలి. రెగ్యూలర్‌గా పోస్టులు పెడుతుండాలి. ఇలా చేస్తే నెలకు రూ.10 లక్షల కంటే ఎక్కువగా సంపాదించవచ్చు.