Moto G86 Power: మాస్ మసాలా ఆఫర్.. 50MP కెమెరా, 6720mAh బ్యాటరీ 5G ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్

Moto G86 Power 5G ధర ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింది. 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.17,999 ఉండగా.. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.2,500 తగ్గింది. అప్పుడు దీనిని రూ.15,499కి కొనుక్కోవచ్చు. అలాగే దీనిపై ఎక్స్ఛేంజ్ తగ్గింపు కూడా ఉంది.

New Update
Moto G86 Power Mobile Offers

Moto G86 Power Mobile Offers

మీరు రూ.15,000 బడ్జెట్‌లో కొత్త మోటరోలా స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా?.. అలాంటి వారి కోసం ఫ్లిప్‌కార్ట్ ఆకట్టుకునే డీల్‌(Flipkart Mobile Offers) లను అందిస్తోంది. Moto G86 Power 5G పై ఫ్లిప్ కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది. ధర తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇప్పుడు Moto G86 Power 5G ఆఫర్‌లు, ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Also Read :  200MPతో బెస్ట్ కెమెరా ఫోన్లు.. రూ.30వేలలోపు లిస్ట్ చూసేయండి..!

Moto G86 Power 5G Price Drop

Moto G86 Power 5Gలోని 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర కంటే ఇప్పుడు కేవలం రూ.17,999 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో.. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2,500 తగ్గింపు ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత Moto G86 Power 5G ధర మరింత తగ్గుతుంది. అప్పుడు దీనిని రూ.15,499కి కొనుక్కోవచ్చు. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.13,650 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో Moto G86 Power 5G ఫోన్‌ ధర మరింత తగ్గుతుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. ఈ ఎక్స్ఛేంజ్ పూర్తి ప్రయోజనం పొందాలంటే.. పాత ఫోన్ మోడల్, ప్రస్తుత స్థితి మెరుగ్గా ఉండాలి.

Also Read :  ఊరమాస్ డిస్కౌంట్.. Iphone 16పై రూ.16వేలకు పైగా తగ్గింపు..!

Moto G86 Power 5G Specs

Moto G86 Power 5G మొబైల్ 6.7-అంగుళాల సూపర్ HD AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2712x1220 పిక్సెల్‌ల రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. Moto G86 Power 5G ఫోన్ భద్రత కోసం ఫేస్ అన్‌లాక్, ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌ అమర్చారు. ఇది 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6720mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. 

కెమెరా సెటప్ పరంగా.. Moto G86 Power 5Gలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో USB టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.4, 5G, 4G LTE, Wi-Fi 6, డ్యూయల్ సిమ్ సపోర్ట్, GPS వంటివి ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు