New Smartphone: ఇదెక్కడి మాస్ రా మావా.. 50MP, 7000 mAh బ్యాటరీతో OPPO కొత్త ఫోన్ అదుర్స్..!

చైనాలో ఒపో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Oppo A6 Pro ని విడుదల చేసింది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌తో వస్తుంది. దీని ధర సుమారు రూ. 22,500 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ సేల్ సెప్టెంబర్ 12 నుంచి జరుగుతుంది.

New Update
OPPO A6 PRO

OPPO A6 PRO

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ oppo తన A-సిరీస్‌లో OPPO A6 PROను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. OPPO A6 PROలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000 mAh బ్యాటరీతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. 

OPPO A6 PRO Price

చైనాలో లాంచ్ అయిన OPPO A6 PRO స్మార్ట్‌ఫోన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 22,500

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 24,500.

16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 27,500జ

16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 30,500 గా కంపెనీ నిర్ణయించింది

ఇది మూడు కలర్‌లలో అందుబాటులో ఉంటుంది. భారతదేశంతో సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

OPPO A6 PRO Specifications

OPPO A6 PRO స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) సెటప్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.57-అంగుళాల ఫుల్ HD + (1,080 × 2,372 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,400 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్ స్థాయిని కలిగి ఉంది. OPPO A6 PRO మొబైల్ ఆక్టాకోర్ 4 nm మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, ఆటోఫోకస్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాను కలిగి ఉంది. దీని వెనుక కెమెరా యూనిట్ 10x డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. 

కనెక్టివిటీ విషయానికొస్తే.. 5G, బ్లూటూత్, NFC, Wi-Fi, USB టైప్-C పోర్ట్ వంటి ఆప్షన్‌లను కలిగి ఉంది. అలాగే ఇది యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను కలిగి ఉంది. Oppo A6 Pro సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందించారు. Oppo A6 Pro మొబైల్ 80 W ఛార్జింగ్‌కు మద్దతుతో 7,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. 

Advertisment
తాజా కథనాలు