IPhone 16 Vs IPhone 17: ఐఫోన్ 16 కంటే 17లో ఏ ఫీచర్లు మారాయో తెలుసా? లిస్ట్ ఇదే..!

ఐఫోన్ 17 సిరీస్, ఐఫోన్ 16 కంటే మెరుగైన అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఐఫోన్ 17లో 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే, కొత్త A19 చిప్‌సెట్, 24MP సెల్ఫీ కెమెరా, వేగవంతమైన ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఐఫోన్ ఎయిర్ మోడల్‌తో పాటు, ఇది సన్నని డిజైన్‌తో విడుదల అయింది.

New Update
IPhone 16 Vs IPhone 17 (2)

IPhone 16 Vs IPhone 17

iphone 17 series తాజాగా విడుదలైంది. ఇది నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో iphone 17, iphone 17 pro, iphone 17 pro max, iphone 17 air ఉన్నాయి. అయితే ఈ సారి iphone 17 plus వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. దీని ప్లేస్‌లో iphone 17 ఎయిర్‌ను తీసుకువచ్చారు. ఈసారి ఐఫోన్ 17 సిరీస్.. దాని పాత మోడల్ ఐఫోన్ 16 సిరీస్‌తో పోలిస్తే అనేక ముఖ్యమైన మార్పులు, మెరుగైన ఫీచర్లను తీసుకొచ్చింది.

ఈ మార్పులు ముఖ్యంగా డిజైన్, డిస్‌ప్లే, పనితీరు, కెమెరా విభాగాలలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఐఫోన్ 16 సిరీస్ కంటే ఐఫోన్ 17 సిరీస్ పెద్ద అప్‌గ్రేడ్‌‌లతో వచ్చింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

Also Read : 

IPhone 16 Vs IPhone 17 Specs

సన్నని డిజైన్

iphone 17 సిరీస్.. iphone 16 కంటే చాలా సన్నగా, నాజూగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో కొత్తగా విడుదలైన iphone 17 ఎయిర్.. కేవలం 5.6 మి.మీ. మందంతో ఆపిల్ చరిత్రలోనే అత్యంత సన్నని ఫోన్‌గా నిలిచింది. 

మెరుగైన డిస్‌ప్లే

ఐఫోన్ 16 సిరీస్‌లోని ఒక్క -ప్రో మోడల్ తప్ప మిగతావన్నీ 60Hz డిస్‌ప్లేతో వచ్చాయి. అయితే ఇప్పుడు రిలీజైన ఐఫోన్ 17 సిరీస్ లోని.. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ అన్నీ 120Hz ప్రోమోషన్ OLED డిస్‌ప్లేతో వచ్చాయి. అంతేకాకుండా ఇది చాలా స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక ఐఫోన్ 16లోని బేస్ మోడల్ 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండగా.. ఇప్పుడు ఐఫోన్ 17 బేస్ మోడల్ 6.3 అంగుళాల డిస్ప్లేతో వచ్చింది. 

సిరామిక్ షీల్డ్ 2

ఐఫోన్ 17 డిస్‌ప్లేపై ఉండే గీతలను నివారించడానికి సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ అందించారు. ఇది ఐఫోన్ 16 లోని ప్రొటెక్షన్ కంటే మూడు రెట్లు మెరుగైన స్క్రాచ్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. 

ప్రాసెసర్

ఐఫోన్ 16 సిరీస్ A18, A18 ప్రో చిప్‌లతో వచ్చాయి. ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ A19, A19 ప్రో చిప్‌సెట్‌లను కలిగి ఉన్నాయి. ఇది మెరుగైన స్పీడ్, సమర్థత, AI సామర్థ్యాలను అందిస్తుంది.

ర్యామ్ 

ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడల్స్‌లోనూ 8GB ర్యామ్ ఉంది. కానీ ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో మోడల్స్‌లో 12GB ర్యామ్ అందించారు. ఇది చాలా ఎక్కువ.

కనెక్టివిటీ

ఐఫోన్ 16 సిరీస్ Wi-Fi 6E తో వస్తే.. ఐఫోన్ 17 సిరీస్ వేగవంతమైన, మరింత స్థిరమైన కనెక్షన్ల కోసం Wi-Fi 7కి అప్‌గ్రేడ్ అయ్యింది.

మెరుగైన కెమెరా

ఐఫోన్ 17 సిరీస్‌లో ముందు కెమెరాకు పెద్ద అప్‌గ్రేడ్ లభించింది. ఐఫోన్ 16 సిరీస్‌లోని అన్ని మోడల్స్ 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండగా.. ఐఫోన్ 17 సిరీస్‌లోని అన్ని మోడల్స్‌ 24MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ప్రో మోడల్స్‌లో కొత్త టెలిఫోటో లెన్స్, 8X ఆప్టికల్ జూమ్, 8K వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ముందు కెమెరాకు కొత్త సెన్సార్‌తో పాటు.. ఫేస్‌టైమ్ కాల్స్ కోసం ‘‘సెంటర్ స్టేజ్’’ ఫీచర్‌ను కూడా అందించారు. ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ మోడల్స్‌లో వెనుక వైపు మూడు 48MP ఫ్యూజన్ కెమెరాలు ఉన్నాయి. అవి మెయిన్, అల్ట్రావైడ్, టెలిఫోటో. ఇది ఫోటోగ్రఫీలో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

బ్యాటరీ & ఛార్జింగ్

ఐఫోన్ 17 సిరీస్‌లో బ్యాటరీ లైఫ్ చాలా మెరుగుపడింది. ఐఫోన్ 17 ఎయిర్ 40 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. అంతేకాకుండా ఛార్జింగ్ వేగం కూడా పెరిగింది. ఐఫోన్ 17 25W MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్, 50W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో కొత్తగా రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ సహాయంతో ఐఫోన్ 17ను ఉపయోగించి ఎయిర్‌పాడ్స్, ఆపిల్ వాచ్ లేదా ఇతర MagSafe-ఎనేబుల్డ్ ఫోన్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు. ఇది ఒక మల్టీపర్పస్ ఛార్జింగ్ సొల్యూషన్‌గా ఉపయోగపడుతుంది. కేవలం 30 నిమిషాల్లో 70% వరకు ఛార్జ్ చేస్తుంది.

Advertisment
తాజా కథనాలు