/rtv/media/media_files/2025/10/16/iphone-diwali-offers-2025-10-16-10-23-26.jpg)
iPhone Diwali Offers
పండుగ సీజన్‌లో ప్రజలను ఆకర్షించడానికి పలు ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లు అనేక ఆఫర్‌లను ప్రకటించాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్(Flipkart Diwali Offer), విజయ్ సేల్స్ సహా మరెన్నో సంస్థలు ఫోన్‌ల నుండి టీవీలు, ఇతర గృహోపకరణాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మరి మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో iPhone 16 Proను అతి తక్కువ ధరలో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. iPhone 16 Pro అనేక ప్లాట్‌ఫామ్‌లలో ఆకర్షణీయమైన ఆఫర్‌లతో అందుబాటులో ఉంది.
Also Read : వామ్మో.. 50mp ఫ్రంట్ కెమెరా స్మార్ట్ ఫోన్ పై రూ.4వేల భారీ తగ్గింపు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే
iPhone Diwali Offers
మీరు ఐఫోన్ 16 ప్రో కొనడానికి ఆసక్తి కలిగి ఉంటే.. ఉత్తమమైన ఆఫర్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. అందువల్ల ఈ ఫోన్‌కు ఏ ప్లాట్‌ఫామ్ తక్కువ ధరను అందిస్తుందో తెలుసుకుందాం. iPhone 16 Pro ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు లభిస్తుంది. దీని అసలు ధర రూ.1,19,900 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.1,04,999 ధరకు అందుబాటులో ఉంది. అదే సమయంలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే కస్టమర్లు అదనంగా రూ.4,000 ఆదా చేసుకోవచ్చు. అదనంగా ఫోన్‌పై రూ.61,900 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. దీంతో మరింత తక్కువ ధరకే iPhone 16 Proను కొనుక్కోవచ్చు.
అయితే ఈ ప్రొడెక్ట్ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కాకుండా.. మీరు దీన్ని ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మరొక ఆన్ లైన్ సంస్థ క్రోమాలో iPhone 16 Proలోని 256GB స్టోరేజ్ మోడల్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. కంపెనీ దీనిని రూ.113,490కి అందిస్తోంది.
అదేవిధంగా iPhone 16 Pro ఫోన్ విజయ్ సేల్స్‌లో కూడా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ అక్కడ రూ.1,14,900 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ ద్వారా మీరు రూ.5,000 ఆదా చేసుకోవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే దీనిని కొనుక్కోవచ్చు. అలాగే iPhone 16 Pro ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్‌లో రూ.1,19,900 కు లిస్ట్ అయింది.
అలాగే ఐఫోన్ 16 ప్రో లోని 128GB స్టోరేజ్ వేరియంట్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ.99,990 కు అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను ఇక్కడ అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
iPhone 16 Pro..120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. iPhone 16 Pro A18 ప్రో ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. తాజా iOSకి మద్దతు ఇస్తుంది. ఇది 48MP + 48MP + 12MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
Also Read : చవక చవక.. ఐఫోన్ 15 వెరీ చీప్ - అమెజాన్ దివాళీ సేల్ లో వీటిపై 80% డిస్కౌంట్..