/rtv/media/media_files/2025/10/04/iphone-16-plus-price-drop-2025-10-04-15-42-31.jpg)
Iphone 16 plus Price Drop
ప్రముఖ అమెరికన్ ఐఫోన్ తయారీ కంపెనీ ఆపిల్ తన తాజా iPhone 17 సిరీస్‌ను సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దాని ముందు మోడల్స్ iPhone 16 సిరీస్‌లపై కంపెనీ భారీ తగ్గింపులను(Iphone 16 Price Drop) ప్రకటించింది. iPhone 16లపై ఇప్పుడు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అందువల్ల మీరు ఈ పండుగ సీజన్‌లో కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో (iphone 16 plus price cut) పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అతి పెద్ద డిస్ప్లేను కలిగి ఉన్న ఈ iPhone 16 ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
iPhone 16 Plus Offers
iPhone 16 Plus బేస్ వేరియంట్ సెప్టెంబర్ 2024లో రూ.89,900కి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.79,999 కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌ల గురించి మాట్లాడుకుంటే.. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ (రూ.750 వరకు) తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత iPhone 16 Plus ధర రూ.79,249కి తగ్గుతుంది.
మరోవైపు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. పాత ఫోన్ లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.43,840 వరకు ఆదా చేయవచ్చు. ఈ తగ్గింపు మొత్తం వర్తిస్తే.. iPhone 16 Plusను కేవలం రూ.35,409లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇంత భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే.. ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. అలాగే మోడల్ బట్టి కూడా ఈ ధరను నిర్ణయిస్తారు. ఈ ఐఫోన్ 16పై దాదాపు రూ.54,491 డిస్కౌంట్ లభిస్తుందన్న మాట.
Also Read : స్నాప్ చాట్ యూజర్లకు బిగ్ షాక్.. డబ్బులు చెల్లిస్తేనే వినియోగం.. లేకపోతే డేటా అంతా డిలీట్!
iPhone 16 Plus Specs
iPhone 16 Plus ఫీచర్ల విషయానికొస్తే.. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2,000 నిట్‌లు గరిష్ట ప్రకాశంతో వస్తుంది. iPhone 16 Plus మెరుగైన సిరామిక్ షీల్డ్ రక్షణ, డైనమిక్ లైటింగ్‌లను కలిగి ఉంది. అలాగే ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ iPhone 16 Plus ఆక్టా-కోర్ ఆపిల్ A18 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో వస్తుంది. కెమెరా సెటప్ విషయానికొస్తే.. iPhone 16 Plus వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.