/rtv/media/media_files/2025/10/04/budget-laptops-2025-10-04-13-38-31.jpg)
Budget laptops
తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్ ఉండే ల్యాప్‌ట్యాప్స్‌ను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల బ్రాండ్లు ఉన్నాయి. వీటిలో బెస్ట్ ఫీచర్స్‌తో పాటు అండర్ 20కె బడ్జెట్‌లో ఉండే ల్యాప్‌టాప్స్ చూద్దాం.
ఇది కూడా చూడండి: Amazon, Flipkart sale: ఐఫోన్లు 'Out of stock' కాకుండా ఉండటానికి 5 సింపుల్ ట్రిక్స్!
జియో బుక్ 4జీ ల్యాప్‌టాప్
ఈ జియో బుక్ 4జీ ల్యాప్‌టాప్ ధర మార్కెట్‌లో రూ.10,990గా ఉంది. దీని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఈ జియో బుక్ బ్యాటరీ జీవితం 8 గంటలు ఉంది. దీని స్క్రీన్ పరిమాణం 11.6 అంగుళాలు ఉండగా.. ప్రాసెసర్ వేగం 2 హెడ్జ్‌లు ఉంది. దీనికి ఆడియో స్పీకర్లు ఇవ్వడంతో పాటు 4జీబీ ర్యామ్ కూడా ఇచ్చారు. తక్కువ బడ్జెట్‌లో ల్యాప్ ట్యాప్ తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.
చువి హీరోబుక్ ప్లస్
దీని ధర రూ.19,999గా ఉంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వర్క్ అయ్యే దీని హార్డ్ డిస్క్ పరిమాణం 256 జీబీ ఉంది. దీని బ్యాటరీ కూడా దీర్ఘకాలంగా ఉంటుంది.
FUTOPIA అల్టిమస్ PRO ఇంటెల్ డ్యూయల్ కోర్
ఈ ల్యాప్‌టాప్ చూడానికి ఎంతో స్టైలిష్‌గా ఉంటుంది. విండోస్ 11 హోమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ సన్నగా ఉంటుంది. దీని బ్యాటరీ కూడా 24 గంటల పాటు ఉంటుంది. ఈ ల్యాప్ ట్యాప్ మార్కెట్‌లో రూ.11,490కే లభిస్తుంది. ఎక్కువ బడ్జెట్ పెట్టి ల్యాప్‌టాప్స్ కొనలేని వారికి ఇవి బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే ర్యామ్ ఎక్కువగా ఉండి, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు అయితే ఎక్కువ కాలం వస్తాయి. తక్కువ ధరవి తొందరగా పాడయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: Snapchat Users: స్నాప్ చాట్ యూజర్లకు బిగ్ షాక్.. డబ్బులు చెల్లిస్తేనే వినియోగం.. లేకపోతే డేటా అంతా డిలీట్!