/rtv/media/media_files/2025/10/04/snapchat-2025-10-04-10-18-47.jpg)
snapchat
ఈ మధ్య కాలంలో స్నాప్ చాట్ బాగా పాపులర్ అయ్యింది. స్నాప్స్, ప్రైవసీ కోసం యూజర్లు ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో ఫొటోలను అందంగా మార్చుకోవచ్చని నేటి తరం యువత వాడుతున్నారు. అయితే ఇప్పటివరకు స్నాప్ చాట్‌కు ఎలాంటి డబ్బులు కట్టక్కర్లేదు. కేవలం ఉచిత ప్లాన్ సేవలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇకపై పేమెంట్‌తో ఉన్న సేవలను అందించబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్నాప్ చాట్‌లో ఎక్కువగా ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. వీటిని అందులో స్టోర్ చేసుకోవాలంటే తప్పకుండా కాస్త ఎక్కువ స్టోరేజ్ కావాలి. అయితే ఇలా తక్కువ కాకుండా ఎక్కువ స్టోరేజ్ కావాలని అనుకునే వారు తప్పకుండా ప్రీమియం ప్లాన్ ఎంచుకోవాలి. అంటే స్నాప్ చాట్‌లో ఉన్న మొమోరీస్ సర్వీస్ ఉండాలంటే దానికి మీరు డబ్బులు కట్టాలి. ఇందులో ఇంతకు ముందు అన్‌లిమిటెడ్ స్టోరేజ్ ఉంది. కానీ ఇప్పుడు కేవలం 5 జీబీకు మాత్రమే పరిమితం చేసింది.
ఇది కూడా చూడండి: New Smartphone: శాంసంగ్ నుంచి మూడు కొత్త ఫోన్లు.. ఫీచర్లు చంపేశాయ్ మచ్చా..!
Users could earlier save unlimited old photos and videos for free, but soon storage beyond 5GB will be paid. This shift aligns Snapchat with other apps moving toward subscription models, meaning long-time users may need to pay to keep their full archive. pic.twitter.com/wAPZhLDYak
— Tech Informer (@Tech_Informer_) October 3, 2025
ఇది కూడా చూడండి: Amazon, Flipkart sale: ఐఫోన్లు 'Out of stock' కాకుండా ఉండటానికి 5 సింపుల్ ట్రిక్స్!
తీసుకునే స్టోరేజ్ బట్టి ఛార్జ్..
దీనికి ధరలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. అది కూడా మీరు తీసుకునే స్టోరేజ్ బట్టి ఛార్జ్ ఉంటుంది. మీరు 5జీబీ స్టోరేజ్ కోరుకుంంటే ప్రీమియం ప్లాన్స్ యూజర్లు ఎంచుకోవాలి. అయితే 100 జీబీ ప్లాన్ కోసం అయితే సుమారుగా నెలకు రూ.165 కట్టాలి. అదే 250 జీబీ స్టోరేజ్ వారు అయితే నెలకు రూ.330 ప్రతీ నెల కట్టాలి. అప్పుడే మీ ఫొటోస్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. అయితే ఉచిత లిమిట్ స్టోరేజ్ దాటిన యూజర్లు ప్రీమియం ప్లాన్‌కి మారాలని అనుకుంటే వారికి 5 జీబీ కంటే ఎక్కువగా స్టోరేజ్ ఉన్నవారికి 12 నెలల వరకు తాత్కాలిక స్టోరేజ్ అందించనున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇలా స్నాప్ చాట్‌కు కూడా డబ్బులు తీసుకుంటే.. యూజర్లు దీన్ని వాడకం తగ్గిస్తారని తెలుస్తోంది. మరి దీనిపై స్నాప్ చాట్ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలి.