Iphone 16 Offers Flipkart: అయ్య బాబోయ్ ఇదేం రచ్చ.. రూ.31వేలకే ఐఫోన్ 16 - దీనవ్వ అస్సలు వదలకండి!

ఫ్లిప్‌కార్ట్‌ సాసాలేలే సేల్‌లో IPHONE 16లోని 128జీబీ వేరియంట్‌ తక్కువ ధరకే లభిస్తుంది. రూ.9,901 డిస్కౌంట్‌తో రూ.69,999కే లిస్టయింది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 38,150 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మొత్తం వర్తిస్తే రూ.31,849కే కొనుక్కోవచ్చు.

New Update
iphone 16 flipkart discount offers

iphone 16 flipkart discount offers

ప్రముఖ ఫోన్ తయారీదారు ఆపిల్ ప్రతి ఏడాది తన కొత్త మోడల్‌ను విడుదల చేస్తోంది. ఈసారి IPHONE 17 సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఆపిల్ ప్రియులు IPHONE 17 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో IPHONE 16 చౌకగా మారుతుందని చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ఐఫోన్ 17 మరికొద్ది రోజుల్లో లాంచ్ కానున్న నేపథ్యంలో IPHONE 16 ధర భారీగా తగ్గింది. దీనిని ఇప్పుడు పలు ఆఫర్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘‘SASA LELE’’ సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో IPHONE 16ను భారీ డిస్కౌంట్‌తో కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!

IPHONE 16 Discount

ఫ్లిప్‌కార్ట్‌లో సాసా లేలే సేల్ నడుస్తోంది. ఈ సేల్ మే 1న ప్రారంభం కాగా.. మే 8 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఇతర ఉత్పత్తులను చౌకగా కొనుగోలు చేయవచ్చు. అందులో ఐఫోన్ 16 సిరీస్‌లోని 128 GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ సమయంలో ఐఫోన్ 16 మోడల్‌లోని 128 GB వేరియంట్ డిస్కౌంట్‌తో లిస్ట్‌ అయింది. దీని అసలు ధర రూ. 79,900 ఉండగా.. ఇప్పుడు ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ నుండి రూ.69,999కు కొనుగోలు చేయవచ్చు. అంటే దీనిపై రూ.9,901 తగ్గింపు లభిస్తుందన్న మాట. ఇది మాత్రమే కాకుండా ఇతర ఆఫర్ల ద్వారా iPhone 16 ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 

Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్

IPHONE 16 Bank Offers

 ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఐఫోన్ 16 కొనుగోలు చేస్తే 5% క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది కాకుండా ఐఫోన్ 16 ను EMI ఆప్షన్‌తో కూడా సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ. 2,461 ప్రారంభ EMIతో iPhone 16 ను కొనుక్కుని ఇంటికి పట్టికెళ్లొచ్చు. 

Also Read: గుండెపోటుకు అరటిపండుతో చెక్‌..రోజుకు 3 తినండి

IPHONE 16 Exchange Offer

పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా ఐఫోన్ 16 ధరపై ఎక్కువ తగ్గింపు పొందవచ్చు. దాదాపు రూ. 38,150 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే ఐఫోన్ 16 కేవలం రూ.31,849లకే లభిస్తుంది. అయితే ఇంత భారీ మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే.. లేటెస్ట్ మోడల్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌లో పెట్టాలి. అలాగే కండీషన్ మంచిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంత మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు. లేదంటే మరికాస్త అమౌంట్ మీ జేబులోంచి పెట్టా్ల్సిందే. 

Also Read: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!

iphone-16 | iphone offers | iphone-offer | apple-iphone-12-flipkart-offer | apple-iphone-12-flipkart-sale | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు