/rtv/media/media_files/2025/05/06/uMleQwo3u6PM9Z2T32f1.jpg)
dilsukhnagar blouse world shop special blouse offer for women
సాధారణంగా ఈ మధ్య కాలంలో షాపింగ్ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అందులోనూ ఫ్యాషన్ అంటే పడి చచ్చిపోయే ప్రజలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు. బట్టలంటే ప్రాణం పెట్టేస్తారు. తరచూ బట్టలు కొనుక్కున్నా కోరిక తీరదు. అందులోనూ ఆఫర్లు పెడితే ఉంటారా?.. పరుగే పరుగు. అవసరం లేకపోయినా ఎగబడి కొనేస్తుంటారు.
ఇది కూడా చదవండి: గుండెపోటుకు అరటిపండుతో చెక్..రోజుకు 3 తినండి
తక్కువ ధరే కదా.. ఏముందిలే అని ఫీలవుతుంటారు. ఇక అలాంటి లేడీస్ వీక్నెస్‌ను క్యాష్ చేసుకునేందుకు చాలా షాపింగ్ మాల్స్, బట్టల షాప్‌లు రకరకాల ఆఫర్లు పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా అలాంటిదే హైదరాబాద్‌లో మహిళల కోసం ఒక బట్టల షాప్ బంపరాఫర్ అందించింది. తక్కువ ధరకే బ్లౌజులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?
రూ.500లకే 5 బ్లౌజ్‌లు
కేవలం అతి తక్కువ ధరకే 5 బ్లౌజులు అంటూ ఆఫర్ పెట్టడంతో మహిళలు, అమ్మాయిలు క్యూ కట్టారు. హైదరాబాద్‌లోని దిల్‌షుక్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. రాజీవ్ చౌక్ దగ్గర కొత్తగా బ్లౌజ్ వరల్డ్ షాపు ఓపెన్ చేశారు. న్యూ షాప్ ఓపెనింగ్‌లో భాగంగా రూ. 500 కే 5 బ్లౌజ్‌లు అంటూ ఆఫర్ పెట్టారు. ఇంకేముంది ఆఫర్ చూడగానే అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు ఆ షాప్‌కు పరుగులు పెట్టారు.
ఇది కూడా చదవండి: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!
వారు వెళ్లడమే కాకుండా రూమ్‌లలో, ఇళ్లలో, హాస్టల్స్‌లో ఉన్న తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళకు ఫోన్లు చేసి ఆఫర్ గురించి చెప్పేశారు. దీంతో తక్కువ ధరకే 5 బ్లౌజులు వస్తుండటంతో మహిళలు భారీ స్థాయిలో ఎగబడ్డారు. ఆఫర్ చూసి బ్లౌజులు కొనడానికి వచ్చిన మహిళలతో షాప్ ఓ రేంజ్‌లో కిక్కిరిసిపోయింది. ఏకంగా కి.మీ మేర మహిళలు క్యూ కట్టారు. లోపల నుంచి బయటకు రావడానికి కొంచెం కూడా చోటు లేకుండా ఆ షాపు కిక్కిరిసిపోవడం గమనార్హం. ఇక షాప్ ఓపెనింగ్ రోజే అద్భుతమైన పబ్లిసిటీ రావడంతో ఆ షాపు ఓనర్ ఫుల్ ఖుష్ అవుతున్నాడు.
ఇది కూడా చదవండి: రోజూ ద్రాక్ష పండ్లు తింటే ఎండలో తిరిగినా ఏమీ కాదా?
viral-news | hyd | latest-telugu-news | offers