/rtv/media/media_files/2025/07/27/infinix-smart-10-price-2025-07-27-13-21-47.jpg)
Infinix Smart 10 price
ఇన్ఫినిక్స్ తన లైనప్‌లో ఉన్న మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 (Infinix Smart 10) ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇన్ఫినిక్స్ ఈ Infinix Smart 10 స్మార్ట్‌ఫోన్‌లో AI ఫీచర్లను అందిస్తోంది. ఇందులో 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇప్పుడు Infinix Smart 10 ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం.
Also Read: ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Infinix Smart 10 Price
Infinix Smart 10 స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6799గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్విలైట్ గోల్డ్, టైటానియం సిల్వర్, స్లీక్ బ్లాక్, ఐరిష్ బ్లూ వంటి నాలుగు కలర్‌లలో లభిస్తుంది. Infinix Smart 10 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 2 నుండి భారతీయ మార్కెట్లో ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
Also Read: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు
Infinix Smart 10 Specifications
Infinix Smart 10లో 6.67-అంగుళాల డిస్ప్లే ఉంది. ఇది HD + రిజల్యూషన్ పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ప్రీమియం డిజైన్, మ్యాట్ ఫినిష్, కాంపోజిట్ స్క్రాచ్ రెసిస్టెంట్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. Infinix Smart 10 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా XOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.
Also Read: రుద్ర బ్రిగేడ్లు, భైరవ్ బెటాలియన్లతో భారత సైన్యం పటిష్టం..ఆందోళనలో పాక్, చైనా
Infinix Smart 10 వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ డ్యూయల్ ప్రైమరీ కెమెరా ఉంది. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. కంపెనీ ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని అందించింది. Infinix Smart 10 ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64 రేటింగ్‌తో వస్తుంది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10లో అనేక AI ఫీచర్లను అందించింది.
Also Read: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మృతి
new-smartphone | telugu tech news | tech-news-telugu | tech-news