/rtv/media/media_files/2025/04/19/D4KqE3EpTNBa1HbUB5bN.jpg)
Infinix Note 50s 5G+ mobile launched in Indi
ప్రముఖ టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తన లైనప్‌లో ఉన్న మరో మోడల్‌ను తీసుకొచ్చింది. Infinix Note 50s 5G+ మొబైల్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.78 అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. శక్తివంతమైన MediaTek Dimensity 7300 Ultimate చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మరెన్నో ఫీచర్లతో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ వేరియంట్లు, ధర, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
Infinix Note 50s 5G+ Price
భారతదేశంలో Infinix Note 50s 5G+ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో బేస్ వేరియంట్ 8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ.15,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా అందుబాటులో ఉంచింది. ఇది మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ, టైటానియం గ్రే, రూబీ రెడ్ కలర్ వేరియంట్లలో వచ్చింది.
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
Infinix Note 50s 5G+ Sale & Offers
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 24 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌ను మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. దీనితో పాటు రూ. 1,000 ఎక్స్ఛేంజ్ ప్రయోజనం కూడా లభిస్తుంది.
Infinix Note 50s 5G+ Specifications
ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 3D కర్వ్డ్ AMOLED ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7300 Ultimate చిప్‌సెట్ ఉంది. దీనితో పాటు 8 GB RAM, 8 GB వర్చువల్ RAM కు మద్దతు ఉంది. మొత్తంగా ఇది 16GB RAM వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది.
Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
ఈ ఫోన్‌లో అద్భుతమైన, అధునాతన ఫీచర్ ఒకటుంది. ఇది సువాసన వెదజల్లే లక్షణాన్ని కలిగి ఉంది. ఈ ఫీచర్ ఫోన్ మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్ వేరియంట్‌లో వస్తుంది. ఈ వేరియంట్‌లో వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. అది సువాసనను విడుదల చేస్తూనే ఉంటుంది. కంపెనీ దీనికి ఎనర్జైజింగ్ సెంట్-టెక్ అని పేరు పెట్టింది.
ఇది నిమ్మకాయల సువాసన, మధ్యలో లిల్లీ ఆఫ్ వ్యాలీ, బేస్ నోట్లో అంబర్, వెటివర్ సువాసనను కలిగి ఉంటాయి. ఈ సువాసన వినియోగదారుడితో పాటు చుట్టూ ఉండే వారికి మంచి అనుభూతిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీనితో పాటు ఫ్లోటింగ్ విండో, డైనమిక్ బార్, గేమ్ మోడ్, కిడ్స్ మోడ్, పీక్ ప్రూఫ్ మొదలైన ప్రత్యేక ఫీచర్లు ఫోన్‌లో అందించారు.
Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
Infinix Note 50s 5G+ లో Sony IMX682 సెన్సార్ తో కూడిన 64MP ప్రధాన కెమెరా ఉంది. సెకండరీ కెమెరా కూడా అందించారు. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరాను అందించారు. దీనికి డ్యూయల్ LED ఫ్లాష్ సపోర్ట్ అందించారు. అలాగే ఈ ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్, యాక్టివ్ హాలో లైటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్‌కు మద్దతు ఇస్తుంది. దీనితో పాటు 10W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
tech-news | telugu tech news | latest-telugu-news | telugu-news