Honor 200 5G: బుర్రపాడు ఆఫర్.. హైక్లాస్ కెమెరా ఫోన్‌పై పిచ్చెక్కించే డిస్కౌంట్ మావా - అస్సలు వదలొద్దు!

అమెజాన్‌లో Honor 200 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8GB/256GB వేరియంట్ రూ.34,999కు లాంచ్ అయింది. ఇప్పుడు దీనిని రూ.21,749 కు కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో దీనిపై రూ.14వేల వరకు తగ్గింపు లభిస్తుంది.

New Update
Honor 200 5G

Honor 200 5G:

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో Honor 200 5G స్మార్ట్‌ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీనిని బ్యాంక్ డిస్కౌంట్ సహా ఇతర తగ్గింపులతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. Honor 200 5G లో అందుబాటులో ఉన్న ఆఫర్‌లు, ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

Honor 200 5G Offers

Honor 200 5G మొబైల్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ జూలై 2024 లో రూ.34,999 కు లాంచ్ అయింది. అయితే ఇప్పుడు దీనిని రూ.21,749 కు కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లో.. HDFC బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై రూ. 1500 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.20,249కి సొంతం అవుతుంది. పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఇస్తే ధరను రూ.20,500 తగ్గించవచ్చు. అయితే పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు. వీటన్నింటితో కలిపి ఈ ఫోన్ లాంచ్ ధర కంటే రూ. 14,750 చౌకగా లభిస్తుంది. 

Honor 200 5G Specifications

Honor 200 5Gలో 6.7-అంగుళాల 1.5K OLED కర్వ్డ్ డిస్‌ప్లే, 2664×1200 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. భద్రత కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు. ఈ ఫోన్‌లో ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా మ్యాజిక్ OS 8.0పై పనిచేస్తుంది. 

ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

Honor 200 5G వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 100W సూపర్‌ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5200mAh బ్యాటరీ ఉంది. 

ఇది కూడా చూడండి:సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం

amazon mobile offers | mobile-offers | honor-200-5g | tech-news-telugu | telugu tech news | tech-news

Advertisment
తాజా కథనాలు