/rtv/media/media_files/2025/09/10/17-2025-09-10-06-50-48.jpg)
I Phone 17 Series
ప్రతీ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లలో యాపిల్ కొత్త ప్రోడక్ట్ లను లాంఛ్ చేయడం ఆనవాయితీ. ఇప్పటి వరకు 16 సిరీస్ లను ప్రవేశపెట్టిన యాపిల్ ఇప్పుడు కొత్తగా 17 సీరీస్ ను లాంఛ్ చేసింది. భారత కాల మానం ప్రకారం మంగళవారం రాత్రి 10.30 గంటలకు కాలిఫోర్నియాలో యాపిల్ పార్క్ లో ఈవెంట్ ను నిర్వహించింది యాపిల్. ఇందులో కొత్త ఐఫోన్ 17 సీరీస్ తో పాటూ పలు ప్రొడక్ట్ ను లాంచ్ చేసింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను యాపిల్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటితో పాటూ న్యూజనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో3, స్మార్ట్ వాచ్ సిరీస్ 11, ఎస్‌ఈ3 వాచ్‌ను యాపిల్ విడుదల చేసింది.
ఐఫోన్ 17లో మరిన్ని కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది యాపిల్. ఇందులో మొదటిది లైవ్ ట్రాన్స్ లేషన్ ఫీచర్ ఒకటి. ఇప్పటి వరకు ఐఫోన్లు అన్నీ పెద్దగా, లావుగా ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చిన 17 సీరీస్ ఫోన్లు మాత్రం స్లిమ్ గా ఉండేలా తయారు చేసింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల బేస్ స్టోరీజీ 256 జీబీగా ఉంది. ఇవి ఐవోఎస్ 26 సాఫ్ట్ వేర్ అప్డేట్ తో పని చేయనున్నాయి. అన్ని ఫోన్లలో 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇచ్చారు. సెరమిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన సీరీస్ లతో పోలిస్తే 17లో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉండనుంది. 20 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే చాలు మొత్తం బ్యాటరీ ఫుల్ అయిపోతుందని చెబుతోంది యాపిల్ కంపెనీ. ఐఫోన్ 17 పీరీస్ ఫోన్లు సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.
Also Read : WhatsApp: యూజర్లకు చుక్కలు చూపిస్తున్న వాట్సాప్.. వెబ్ సేవలకు అంతరాయం!
కొత్తగా ఐఫోన్ ఎయిర్..
ఈసారి ఐఫోన్ సీరీస్ లో యాపిల్ కొత్తగా ఐఫోన్ ఎయిర్ ను పరిచయం చేసింది. ఇది ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఐఫోన్లలో ఇది అత్యంత స్లిమ్ ఫోన్. ఇందులో ఏ19 ప్రో చిప్ ఉంటుంది. వెనకవైపు కేవలం ఒకే ఒక కెమెరా 48 ఎంపీతో ఇచ్చారు. ముందువైపు 18 ఎంపీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్లను ఈ-సిమ్‌తో తీసుకొచ్చారు. 6.5 అంగుళాల డిస్‌ప్లే తో.. లేటెస్ట్ ఏఐ ఫీచరతో ఐఫోన్ ఎయిర్ వస్తోంది. ఈఫోన్లను 80 శాతం రిసైకిల్ చేసిన టైటానియం పదార్థంతో తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది. ఇవి అత్యంత డ్యూరబుల్‌గా ఉండనున్నట్లు యాపిల్ సీఈవో టిమ్‌కుక్ తెలిపారు. యాపిల్ ఎయిర్ ఫోన్ నాలుగు రంగుల్లో ఉండనున్నాయి. స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్, స్కై బ్లూ రంగులో ఇవి ఉండనున్నాయి. 512GB, 1TB వేరియంట్లలో ఈ ఫోన్లు లభించనున్నాయి. ఐఫోన్ ఎయిర్ 256 జీబీ వేరియంట్ ధర రూ.1,19,900గా నిర్ణయించారు.
17 సీరీస్ ఫీచర్లు, ధరలు..
ఇక ఐఫోన్ 17(iphone-17) సీరీస్ లో వేరియంట్ల ధరల విషయానికి వస్తే.. భారత్‌లో ఐఫోన్ 17 256 జీబీ వేరియంట్ ధర రూ.82,900గా ఉండనుంది. 17 ప్రో 512 జీబీ, 1టీబీ వేరియంట్లలో లభించనుండగా, 17 ప్రో మ్యాక్స్ 512 జీబీ, 1టీబీ, 2 టీబీ వేరియంట్లలోనూ లభించనుంది. ఐఫోన్ 17 ప్రో 256 జీబీ ధర రూ.1,34,900, ఐఫోన్ ప్రో మాక్స్ 256 జీబీ ధర రూ.1,49,900గా ఉన్నాయి. ఇక ఐఫోన్ ప్రోమ్యాక్స్ లో ఈసారి కొత్తగా వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కొత్తగా అమర్చారు. సిల్వర్, డీప్ బ్లూ, కాస్మిక్ ఆరెంజ్ రంగుల్లో ఇవి రానున్నాయి. ఇందులో A19 ప్రో చిప్‌ను అమర్చారు. గత ఫోన్ల కంటే ఎక్కువగా స్క్రాచ్ రెసిస్టెంట్‌గా ఇవి పనిచేయనున్నట్లు కంపెనీ తెలిపింది. వెనకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఇచ్చారు. మూడూ 48 ఎంపీ కెమెరాలే ఉన్నాయి. ఐఫోన్ లాంచ్ చేసిన మోడళ్లలో వెనక వైపు అన్ని కెమెరాలు ఒకే మెగాపిక్సల్స్ కలిగి ఉండడం ఇదే తొలిసారి. ఈ మూడు కెమెరాలు ఫ్యూజన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేయనున్నాయి.
Also Read : నమ్మరేంట్రా బాబు.. రూ.2వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ - పరుగో పరుగు!