WhatsApp: యూజర్లకు చుక్కలు చూపిస్తున్న వాట్సాప్.. వెబ్ సేవలకు అంతరాయం!

నేడు వెబ్ యూజర్లుకు స్క్రోలింగ్ విషయంలో వాట్సాప్ చుక్కలు చూపిస్తోంది. ఒక్కసారిగా సేవలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా వారి సమస్యను తెలియజేస్తున్నారు.

New Update
Whatsapp

Whatsapp

ఇటీవల యూజర్లకు వాట్సాప్(WhatsApp) చుక్కలు చూపిస్తోంది. వెబ్ లాగిన్(WhatsApp Web Login) విషయంలో వాట్సాప్ బాగా డౌన్ అయ్యింది. దీంతో వర్క్ చేసే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు వెబ్ యూజర్లుకు స్క్రోలింగ్ ఇబ్బంది పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు ట్విట్టర్ ద్వారా వారి సమస్యను తెలియజేస్తున్నారు. వాట్సాప్ యూజర్లు పేజీని రిఫ్రెష్ చేయడం వల్ల ఈ సమస్య నుంచి తాత్కలికంగా బయటపడవచ్చని పలువురు చెబుతున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఈ సమస్య మొదలవుతోంది. దీనిపై వాట్సాప్, మెటా ఇంకా స్పందించలేదు. 

ఇది కూడా చూడండి: Mobile Offer: నమ్మరేంట్రా బాబు.. రూ.2వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ - పరుగో పరుగు!

ఇబ్బంది పడుతున్న వెబ్ యూజర్లు..

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 8వ తేదీన వాట్సాప్‌లో సమస్యలు వచ్చాయి. మధ్యాహ్నం 1:10 గంటల ప్రాంతంలో వెబ్‌సైట్, యాప్ రెండింటిలోనూ సమస్యలు రావడం యూజర్లు ప్రారంభించారు. మధ్యాహ్నం 1:55 గంటల నాటికి దాదాపు 290 మంది సమస్యలను తెలిపారు. ఇందులో 54 శాతం ఫిర్యాదులు సర్వర్ కనెక్షన్ సమస్యల గురించి వచ్చాయి. ఇక 24 శాతం వెబ్‌సైట్‌, 22 మంది యాప్ వినియోగించేటప్పుడు సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక అభివృద్ధిలో, ఆపిల్ పరికరాల్లో నిర్దిష్ట లక్ష్య వినియోగదారులపై అధునాతన దాడులను అనుమతించే భద్రతా దుర్బలత్వాన్ని వాట్సాప్ సరిచేసింది. మెటా ప్లాట్‌ఫారమ్‌ల యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్, iOS, iPadOSలోని బగ్‌తో కలిపి, హ్యాకర్లు ఆపిల్ పరికరాల నుంచి సమాచారాన్ని దోపిడీ చేయడానికి అనుమతించారని ఓ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. మరికొందరు వాట్సాప్ అప్‌డేట్(WhatsApp Update) చేసుకుంటే ఇలాంటి సమస్య ఉండదని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Mobile Offers: చవక చవక.. ఐఫోన్ 15, 16 సిరీస్‌లపై అరాచకమైన డిస్కౌంట్లు..!

Advertisment
తాజా కథనాలు