/rtv/media/media_files/2025/09/08/oppo-k13x-5g-2025-09-08-08-52-47.jpg)
Oppo K13x 5G
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ఓ ఊపు ఊపేస్తోంది. కొత్త కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అధునాతన ఫీచర్లు అందిస్తూ కొత్తదనాన్ని అందిస్తూ వస్తోంది. ఇప్పటికి ఎన్నో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసి అలరించింది. ఇప్పుడు మరొక మొబైల్‌ను మార్కెట్‌లో పరిచయం చేసింది. ఇటీవల ఒప్పో తన సరసమైన స్మార్ట్‌ఫోన్ Oppo K13x 5G ని విడుదల చేసింది.
ఇప్పుడు ఈ ఫోన్‌పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ Oppo K13x 5G ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా దీనిపై భారీ బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. వీటన్నింటితో కలిపి Oppo K13x 5G మొబైల్‌ను రూ.2వేలకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
Oppo K13x 5G Price & Offers
Oppo K13x 5G స్మార్ట్‌ఫోన్‌లోని బేస్ వేరియంట్‌పై ఈ తగ్గింపు లభిస్తోంది. ఇందులోని 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999కి ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.11,999లకే లిస్ట్ అయింది. అంటే రూ.4వేల తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే HDFC బ్యాంక్ కార్డ్ చెల్లింపుపై మరో రూ.1500 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత Oppo K13x 5G రూ.10,499కి అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.8,350 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ మొత్తం వర్తిస్తే మీరు Oppo K13x 5G ఫోన్‌ను కేవలం రూ.2,149లకే కొనుక్కోవచ్చు. అయితే ఈ ఆఫర్ మొత్తం పొందాలంటే.. పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు.
Oppo K13x 5G Specs
Oppo K13x 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1604 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అదే సమయంలో ఈ ఫోన్‌లో ఆర్మ్ మాలి-G57 GPUతో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అందించారు. ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కలర్ OS 15పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 4GB / 6GB / 8GB RAM + 128GB / 256GB స్టోరేజ్ ఉన్నాయి. దీనిని మైక్రో SD ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. అలాగే 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని అందించారు.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. Oppo K13x 5Gలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.