Amazon Mobile Offers : ఇవాళే లాస్ట్.. చౌక ధరలకు టీవీ, ఫోన్, ప్రొజెక్టర్ కొనేయండి మావా..!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నేటితో ముగుస్తుంది. ఈ ఆఖరి సేల్ లో స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాల వరకు ప్రతిదానిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది. రూ.599 నుండి స్పీకర్లు పొందొచ్చు.

New Update
amazon

amazon

అమెజాన్‌లో కొనసాగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్(amazon-great-indian-festival-sale) ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. దీపావళితో పాటు అక్టోబర్ 20 ఈ సేల్ చివరి రోజు. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ సేల్ చివరకు చివరి దశకు చేరుకుంది. ఈ సేల్ అనేక ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. ఈ ఆఫర్లను పొందేందుకు చివరి రోజు అక్టోబర్ 20. ఈ సేల్ స్మార్ట్‌ఫోన్‌(mobile-offers)ల నుండి స్మార్ట్ టీవీ(amazon-great-indian-festival-tv-prices)లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాల వరకు ప్రతిదానిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తుంది. 

Also Read :  దీపావళికి బెస్ట్ గిఫ్ట్ లు.. ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి నిమిషాల్లో డెలివరీ

Amazon Great Indian Festival Sale Ends Today

Also Read :  బంగారం లాంటి ఆఫర్.. 5జీ ఫోన్ పై భారీ తగ్గింపు - డోంట్ మిస్

ఈ సేల్ సమయంలో OnePlus 13వేల రూపాయల ధర తగ్గింపుతో లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 57,999 కు కొనుగోలు చేయవచ్చు. అలాగే Samsung Galaxy S24 Ultra 5G పై కూడా ఆఫర్ ఉంది. ఇది రూ. 79,999 కు అందుబాటులో ఉంది. బ్యాంక్ డిస్కౌంట్ లతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఇవి మాత్రమే కాకుండా మీరు ఐఫోన్ 15ను రూ.50,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ధర 128GB స్టోరేజ్ వేరియంట్ కు వర్తిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.49,999 కు లభిస్తుంది. మీరు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో మరింత తక్కువ ధరకు కొనుక్కోవచ్చు.

మీరు ఒక పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తుంటే.. తక్కువ బడ్జెట్‌లో ఉన్న అదిరే స్మార్ట్ ప్రొజెక్టర్ మంచి ఎంపిక. మీరు మార్కెట్లో రూ.5,000 నుండి ప్రారంభమయ్యే స్మార్ట్ ప్రొజెక్టర్‌లను కొనుక్కోవచ్చు. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్‌లపై OTT ప్లాట్‌ఫామ్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే రూ.6,799 నుండి ప్రారంభమయ్యే టీవీలను కూడా కొనుక్కోవచ్చు.

దీపావళి సేల్ సమయంలో మీరు డిస్కౌంట్‌తో స్పీకర్లను కూడా కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ.599 నుండి స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో జెబ్రోనిక్స్, బోట్, పిట్రాన్, ప్రోట్రానిక్స్, ఉబన్, జస్ట్ కోర్సెకా వంటి బ్రాండ్‌లు ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు