/rtv/media/media_files/2025/02/09/zD7PjhAeaOLPMr7FFhpD.jpg)
Delhi Elections
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరమైన అవమానాన్ని మూటగట్టకుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం ఎన్నికల ఫలితాల్లో తుడిచిపెట్టుకుపోయారు. ఆప్ నుంచి ఒక్క అతిశీ తప్ప మిగతా ప్రముఖ నేతలంతా ఓడిపోయారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి. మరోవైపు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. చాలా సీట్లలో అభ్యర్థులకు డిపాజిట్స్ కూడా రాలేదు. చాలా చోట్ల మూడో స్థానానికే పరిమితం అయ్యారు. దీంతో పాటూ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా గట్టి దెబ్బ కొట్టింది. పదికి పైగా సీట్లలో ఓట్లను చీల్చి బీజేపీ గెలిచేలా చేసింది.
ఢిల్లీలో మొత్తం 70 సీట్లకు గానూ 48 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం 22 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఆ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సైతం ఓటమి పాలయ్యారు. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 36. దీంతో 48 సీట్లు సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతోంది. ఆప్ కు 22 సీట్లు వచ్చాయి. మరో పది చోట్ల కాంగ్రెస్ వల్ల దెబ్బ తింది. అంటే...అక్కడే కనుక కాంగ్రెస్ లేకపోయి ఉంటే ఆమ్ ఆద్మీ మరో పది సీట్లు తన ఖాతాలో వేసుకుని ఉండేది. దాంతో మ్యాజిక్ ఫిర్ సాధించింది అయితే నాలుగోసారి అధికారం చేజిక్కుంచుకునేది లేదా కనీసం హంగ్ ప్రభుత్వం అయినా ఏర్పాటు చేసేది. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి మంత్రి సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జంగ్‌పురా సీటు ఇలా అన్ని సీట్లలో ఆప్ విజయాన్ని హస్తం అడ్డుపెట్టి ఆపేసింది.
కాంగ్రెస్ వల్ల ఆప్ ఓడిపోయిన స్థానాలు ఇవే..
న్యూ ఢిల్లీ..
న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ 4, 089 ఓట్లతో కేజ్రీవాల్ ను ఓడించారు. పర్వేశ్ కు మొత్తం 30088 ఓట్లు రాగా, కేజ్రీవాల్‌కు 25999 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు 4568 ఓట్లు వచ్చాయి. కరెక్ట్ గా ఇవే ఓట్లు కేజ్రీవాల్ ఓటమికి కారణమయ్యాయి. అదే కేజ్రీవాల్ కు సందీప్ దీక్షిత్ వచ్చిన ఓట్లు వచ్చి ఉంటే పర్వేశ్ సింగ్ దాదాపు 500 ఓట్లతో ఓడిపోయేవారు.
జంగ్ పురా...
ఇక్కడ నుంచి మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పోటీ చేశారు. ఈయన బీజేపీ అభ్యర్థి అభ్యర్థి 675 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ కూడా ఆప్ పరాజయానికి కాంగ్రెస్ పరోక్షంగా కారణం అయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌కు చెందిన ఫర్హాద్ సూరికి 7350 ఓట్లు వచ్చాయి. మార్వాకు 45.44 శాతం, ఫర్హాద్ సూరికి 8.6 శాతం, మనీష్ సిసోడియాకు 44.65 శాతం ఓట్లు వచ్చాయి.
గ్రేటర్ కైలాష్..
గ్రేటర్ కైలాష్‌లో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ 3188 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6711 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థికి, ఆప్ అభ్యర్థికి ఉన్న తేడా కేవలం నాలుగు శాతం. కాంగ్రెస్ గెలిచిన శాతం 6.47 అంటే...కాంగ్రెస్ లేకపోయి ఉంటే ఆ ఓట్లు ఆప్ కు వెళ్ళి బీజేపీ ఓడిపోయి ఉండేది.
మాలవీయనగర్..
మాలవీయ నగర్‌లో గెలుపు, ఓటమిల తేడా 2131 ఓట్లు. బిజెపికి చెందిన సతీష్ ఉపాధ్యాయ్ మాజీ మంత్రి, ఆప్ నాయకుడు సోమనాథ్ భారతిని ఓడించారు. భారతి ఓడిపోయిన ఓట్ల సంఖ్య కంటే కాంగ్రెస్ అభ్యర్థి జితేంద్ర కుమార్ కొచ్చర్ కు ఎక్కువ ఓట్లు 6770 వచ్చాయి.
రాజేంద్రనగర్ మరి కొన్ని..
రాజేంద్ర నగర్‌లో బిజెపికి చెందిన ఉమాంగ్ బజాజ్ ఆప్‌కు చెందిన దుర్గేష్ పాఠక్‌ను 1231 ఓట్ల తేడాతో ఓడించగా, కాంగ్రెస్‌కు 4015 ఓట్లు వచ్చాయి. ఇలాగే సంగం విహార్, తిమార్పూర్, మొహ్రౌలీ, త్రిలోక్ పురిలలో కూడా ఆప్ ఓడిపోయిన ఓట్ల కంటే కాంగ్రెస్ గెలిచిన ఓట్ే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే కచ్చితంగా విజయం ఆప్ సొంతమయ్యేది.
/rtv/media/media_files/2025/02/09/X6OmlCD3Zad60Gms24Pq.jpeg)