/rtv/media/media_files/2025/02/05/WC7Dx659tYzNPkriCwwF.jpg)
Delhi Elections 2025 exit polls
Delhi Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఢిల్లీలో బీజేపీదే అధికారమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరీ 42-50, జేవీసీ పోల్ 39-45 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ఇక కేకే సర్వే మాత్రం ఆప్ కు 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
అధికారం కోసం సర్వ శక్తులొడ్డిన బీజేపీ..
ఢిల్లీ పీఠం కోసం బీజేపీ 27 ఏళ్లనుంచి ఎదురుచూస్తోంది. ఢిల్లీ అధికారం అందని ద్రాక్షగా మారడంతో ఈసారి సవాల్ గా తీసుకున్న మోడీ ప్రభుత్వం ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో పక్కా ప్రణాళికలు వేస్తూ ముందుకెళ్లింది. ఆప్ ను దెబ్బకొట్టేందుకు విభిన్న ప్రయత్నాలు చేసింది. దేశ రాజధానిలో 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. బీజేపీ దూకుడుగా ప్రచారం చేసింది. ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్రనాయకులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆప్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, పరిపాలన సక్రమంగా లేదని ఆరోపణలు చేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే అభివృద్ది జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలు తీరుతాయని జోరుగా ప్రచారం చేశారు.
#DelhiElections2025
— TIMES NOW (@TimesNow) February 5, 2025
Delhi (Total Seats: 70) | Poll of Polls Projection:
- BJP+ : 45.5%
- AAP: 43.7%
- Congress: 8%
- Others: 2.8%
Watch as @NavikaKumar & @Swatij14 take us through the #PollOfPolls projections. pic.twitter.com/KrQriJPJYw
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నించింది. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించారు. తాము చేపట్టిన కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు జాగ్రత్తగా వివరించారు.
ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీది ముగిసిన అధ్యాయమని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం చంద్రబాబును ఆయన అధికారిక నివాసం వన్ జన్‌పథ్‌లో కలిశారు. ఏపీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో ఆప్ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయింది. తప్పును కప్పి పుచ్చుకునేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ మీద విమర్శలు చేసింది. బిజీ షెడ్యూల్‌లో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం, టీడీపీ ఎంపీలు, జనసేనఎంపీలు ప్రచారంలో భాగమయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రజలు గత రెండు ఎన్నికల్లో ఆప్‌కి మద్దతు ఇచ్చి మోసపోయంటున్నారు. బీజేపీకి వాళ్లంతా అండగా నిలువబోతున్నారు’ అని అన్నారు.
కాంగ్రెస్ ఢిల్లీలో అనూహ్యంగా విజయం సాధించాలని భావించింది. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆప్, బీజేపీ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రధానంగా పాలన, అవినీతి ఆరోపణలు, ఓటర్ల జాబితా తారుమారు, శాంతిభద్రతలు అంశాలపైనే జరిగింది.
Follow Us