PEOPLES PULSE Delhi Exit Poll: బీజేపీదే అధికారం.. పీపుల్స్ పల్స్ ఎగ్టిట్ పోల్ లెక్కలివే!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా 57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. బీజేపీ 51- 60 సీట్లు గెలవబోతున్నట్లు పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడించాయి.

author-image
By srinivas
New Update
Delhi Exit Polls

Delhi Assembly Election Exit Polls Results

Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగగా  57.70 శాతం ఓటింగ్ శాతం నమోదైంది. దీని ఆధారంగా ఢిల్లీ పీఠం బీజేపీకే దక్కబోతున్నట్లు ఫలితాలు వెలువడ్డాయి. నార్త్‌-ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్‌ నమోదైంది. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్‌,  రాహుల్ గాంధీ,  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బీజేపీకి జైకొట్టిన ఢిల్లీ ఓటర్లు..

పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన సర్వేలో బీజేపీకి జైకొట్టనున్నారని వెల్లడైంది. 27 సంవత్సరాల తరువాత ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టబోతున్నట్లు ఈ సర్వే పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 51- 60, ఆమో ఆద్మీ పార్టీ 10-19, కాంగ్రెస్ , ఇతరులు ఒక్క సీటు కూడా గెలిచే అవ‌కాశం లేదని వెల్లడించింది. 

ఆప్ పార్టీకే మహిళల మద్ధతు..

ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ను కోరుకుంటున్నట్లు సర్వేలో బయటపడినట్లు తెలిపింది. ఇక మహిళా ఓటర్లు ఆప్ పార్టీకే జైకొట్టినట్లు తెలిపింది. మహిళా ఓటర్లలో బీజేపీపై ఆప్ పార్టీ 8.3 శాతం ఆధిక్యత కనబరుస్తోంది. మహిళలు ఆప్ పార్టీకి 50.20, బీజేపీకి 41.90, కాంగ్రెస్ కు 6.10, ఇతరులకు 1.90 మద్దతిస్తున్నారని వెల్లడించింది. ఇక బీజేపీకి బ్రాహ్మణులు, రాజ్ పుత్, యాదవ్, జాట్, బనియా, కశ్మీరీ పండిట్లు, గుప్త సామాజికవర్గాలు మద్దతిస్తున్నారు. అగ్రవర్ణాల వారు, వెనుకబడిన ఓబీసీలు బీజేపీకి, దళితులు ఆప్ పార్టీకి మద్దతిస్తున్నారు. హిందువులు, జైన్లు, ఇతరులు బీజేపీకి, ముస్లింలు, సిక్కులు ఆప్ పార్టీకి మద్దతిస్తున్నారు. బీజేపీకి పూర్వాంచల్, ఢిల్లీ, ఉత్తరాది, హర్యానాబి, పాహడి ప్రాంతాలకు చెందిన ప్రజలు మద్దతిస్తుండగా, ఆప్ పార్టీకి పంజాబీలు, దక్షిణాది ప్రజలు మద్దతిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: డిప్యూటీ సీఎం పవన్ కు తీవ్ర అనారోగ్యం

మోస్ట్ పాపుర్ లీడర్ గా కేజ్రీవాల్.. 

ఆమ్ ఆద్మీ పార్టీకి దళితులు, ముస్లింలు, సిక్కులు, జాతవ్, చమార్, వాల్మీకి సామాజికవర్గాల్లో అధిక మద్దతు లభిస్తోంది. పంజాబీలు, దక్షిణాది ఓటర్లు ఆప్ పార్టీకి మద్దతిస్తున్నారు. మోస్ట్ పాపుర్ లీడర్ గా కేజ్రీవాల్ నిలిచారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మధ్యతరగతి వారు, ధనవంతులు, బీజేపీకి, పేదలు ఆప్ పార్టీకి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చీలిస్తున్న ఓట్ల వలన ఆప్ పార్టీ నష్టపోతోంది. ముస్లింలు, దళితులు, ఓటర్లలో చీలిక బీజేపీకి కలిసొచ్చింది. పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి  పర్యవేక్షణలో ఢిల్లీ ఎక్జిట్ పోల్ ను  సీనియర రీసెర్చర్ జి.మురళికృష్ణ, రీసెర్చర్లు జంపాల ప్రవీణ్, మురళికృష్ణ శర్మ, ప్రదీప్, లక్ష్మి తదితరులు నిర్వహించారు. డేటా అనాలసిస్, టెక్నికల్ సపోర్ట్ ను కొడిమో టెక్నాలజీ సొల్యూషన్ సంస్థ అందించింది.

Advertisment
తాజా కథనాలు