USA: అమెరికాలో మరోసారి రాజుకున్న కార్చిచ్చు
దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి మంటలు చెలరేగాయి. 8వేల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్క రోజులోనే 41 చ.కి.మీ. విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి మంటలు చెలరేగాయి. 8వేల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్క రోజులోనే 41 చ.కి.మీ. విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఉత్తరాన కొత్త మంటలు వ్యాపించాయి. అక్కడి శాంటా క్లారిటీ వ్యాలీలో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో దాదాపు 31 వేల మంది ఇళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది. శాంటా ఆనా పొడిగాలుల కారణంగా మంటలు చెలరేగాయి.
అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ నిల్వ ప్లాంట్లలో ఒకదానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది మందిని ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కాలిఫోర్నియాలోని జాతీయ రహదారి 1లోని ఒక భాగాన్ని పూర్తిగా మూసివేశారు.
లాస్ ఏంజెలెస్‌లో మంటలు ఇంకా చల్లారలేదు. దానికి తోడు ఈరోజు నుంచి శాంటా ఆనా గాలులు మరింత బలంగా వీస్తాయని...దీని వల్ల అక్కడ పరిస్థితులు క్రిటికల్‌గా మారనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లాస్ ఏంజెలెస్ బయటకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత ఏడెనిమిది రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మండిపోతూనే ఉంది. ఎంత ప్రయత్నిస్తున్నా కార్చిచ్చును నిలువరించలేకపోతున్నారు. ఈ మంటలకు కారణం న్యూఇయర్ రోజున కాల్చిన బాణాసంచానాయే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాలిఫోర్నియా , లాస్ ఏంజిల్స్ అడవుల్లో వ్యాపించిన మంటలు కాలక్రమేణా మరింత తీవ్రంగా తయారవుతున్నాయి.కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ జైలు విభాగం బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఖైదీలు సహాయం చేసినందుకు బదులుగా శిక్షను రెండు రోజులు తగ్గించే ఒప్పందం కుదుర్చుకుంది.
ఇప్పటికే ఆరు రోజులై మంటలలో కాలిపోతున్న లాస్ ఏంజెలస్ రానున్న రెండు రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతుందని అంటోంది అక్కడ వాతావరణ శాఖ. సోమవారం నుంచి గాలులు వేగం ఇంకా ఎక్కువ పెరగడం వలన దావాగ్ని మరింత వ్యాపించొచ్చని చెబుతోంది.
టెక్సాస్‌లో ఫిబ్రవరి 29న మొదలైన అడవి మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు చనిపోయారు. టెక్సాస్ చరిత్రలో ఇదే అతిపెద్ద అగ్నిప్రమాద ఘటన. మంటలు ఇళ్లకు కూడా వ్యాపించడంతో 500కు పైగా నివాసాలు కాలి బూడిదయ్యాయి.