/rtv/media/media_files/2025/01/12/ZUMBUSUTNcPdO21AGIP3.jpg)
LA Wild Fire
లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చులు మరింత తీవ్రంగా విరుచుకుపడే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి కారణం గాలులు వేగం మరింత పెరగడమే అని చెబుతోంది. దీంతో అక్కడ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే నీటి కొరతతో అంటుకున్న మంటలను ఆదుపులోకి తీసుకు రాలేకపోతున్నారు. ఇవి మరింత ఎక్కువ అయితే ఏం చేయాలో తెలియడం లేదు అని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లో పాలిసైడ్స్ , ఈటన్ ఫైర్ తో పాటు మరో రెండు కార్చిచ్చులు మండుతున్నాయి. ఇవి దాదాపు 40 వేల ఎకరాలను బుగ్గిపాలు చేశాయి. లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో బూడిదైన ఆస్తి విలువ.. ఇండియా బీహార్, యూపీ, ఢిల్లీ మూడు రాష్ట్రాల బడ్జెట్‌తో సమానం. ఇప్పటి వరకు 16 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 1.5 లక్షల మంది ఎప్పుడైనా సరే తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లాల్సిన రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్నారు. 12 వేల భవనాలు కాలి బూడిదైయ్యాయి.
గాలుల వేగం పెరుగుతుంది..
ఇప్పుడు ఇవి మరింత వ్యాపించనున్నాయి అని తెలుస్తోంది. సోమవారం నుంచి రెండు రోజుల పాటూ గాలుల వేగం మరింత ఎక్కువ అవనున్నాయి. దీంతో మంటు ఇంకా ఎక్కువ వేగంతో వ్యాపించే అవకాశం ఉంది. ఇప్పటికే లాస్ ఏంజెలెస్‌లో చాలా ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఇప్పుడు అవి మరో దిక్కుకు కూడా పాకుతున్నాయి.
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నివాసం ఉండే బ్రెంట్‌వుడ్ వైపు కూడా మంటలు వ్యాపించాయి. మీడోలార్క్, గ్రెనడా హిల్స్ ప్రాంతాల వైపు మంటలు ఎగిసిపడుతున్నాయి. లాస్ ఏంజెలెస్‌లో ఎక్కడ చూసినా అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్లు దర్శనమిస్తున్నాయి. అమెరికాలోని వివిధ ఏజెన్సీల డేటా ప్రకారం.. 2025 జనవరి 6 నుంచి లాస్ ఏంజిల్స్‌ని దహిస్తున్న కార్చిచ్చు అమెరికా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన అగ్ని ప్రమాదం కావచ్చని చెబుతున్నాయి.
Also Read: Delhi: మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్