క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..

లాస్ ఏంజెలెస్‌లో మంటలు ఇంకా చల్లారలేదు. దానికి తోడు ఈరోజు నుంచి శాంటా ఆనా గాలులు మరింత బలంగా వీస్తాయని...దీని వల్ల అక్కడ పరిస్థితులు క్రిటికల్‌గా మారనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లాస్‌ ఏంజెలెస్ బయటకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

New Update
Wild Fire

LA Wild Fire

వారం దాటింది...కానీ లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు దాహం మాత్రం ఇంకా చల్లారలేదు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు మంటలను ఆపడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. రాత్రి, పగలనక పని చేస్తున్నారు. దావానలం వ్యాపించకుండా ఉండడానికి నీళ్తో పాటూ పింక్ కలర్ ద్రాణాన్ని చల్లుతున్నారు. అయినా కూడా ఇంకా మంటలు మండుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఎనిమిది రోజులు అయింది కానీ ఇంకా అవి చల్లారలేదు. మరవైపు దీని కారణం 25 మంది చనిపోయారు. పాలిసాడ్స్ లో ఎనిమిది మంది చనిపోగా, ఈటన్ ప్రాంతంలో ఇప్పట వరకు 17 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  92 వేల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారు. 19 వేల కంటే ఎక్కువ నివాసాలు కాలా బూడిద అయ్యాయి. లాస్ ఏంజెలెస్‌లో పెద్ద పెద్ద భవనాలు, అట్రాక్షన్స్ అన్నీ మంటలకు ఆహుతి అయ్యాయి. ఇప్పటి వరకు 40 వేల ఎకరాలను మంటలు కాల్చేశాయి. 

మరింత వేగంతో గాలులు...

నేషనల్ సర్వీసెస వెదర్ ప్రకారం ఈరోజు నుంచి గాలులు మరింత వేగం పుంజుకోనున్నాయి. పర్వతాల్లో ఇవి 50–70 మీటర్ల వేగంతో వీస్తాయని..తీర ప్రాంతాలు, నేల మీద 30–50 మీటర్ల వేంగతో ఉంటాయని చెబుతోంది. లాస్ ఏంజెలెస్, వెంచురా కౌంటీలకు ఈ గాలుల ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ రెండు కౌంటీలకు రెడ్ అలెర్ట్‌ను ప్రకటించారు. ఈరోజు మొదలైన గాలులు రేపు రాత్రి అంటే బుధవారం రాత్రి వరకూ ఉండవచ్చని అంచనా వేశారు. మరోవైపు ఈ విండ్‌లో తేమ తక్కువగా ఉంటుందని దీని వలన పేలుడుతో కూడినటువంటి మంటలు వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది నేషనల్ వెదర్ సర్వీసెస్. ఇప్పటికే అక్కడి ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. కార్చిచ్చు కారణంగా లాస్ ఏంజెలెస్, ఈటన్, మాలిబు లాంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. దీన్ని రేపు కూడా కొనసాగించాలని అక్కడి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కర్ఫ్యూలో  తిరిగివారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. 

ఆరు నెలల వరకూ సహాయం...

ఇక మంటలు ఆగిన ప్రదేశాలకు జనాలు తిరిగి వస్తున్నారు. అయితే అక్కడ  ఇళ్ళన్ని కాలిపోయి ఉండడం వలన ఎక్కడ, ఎలా ఉండాలో తెలియక అవస్థలు పడుతున్నారు. మరోవైపు విథిలాను శుభ్రం చేస్తున్నప్పుడు వస్తున్న దుమ్ము, బూడిద ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీని వలన చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీని నుంచి బయటపడడానికి ఎన్–95 మాస్కులు తప్పనిసరిగా ధరించాలని హెల్త్ డిపార్ట్‌మెంట్ అధకారులు చెబుతున్నారు.  మరోవైపు లాస్ ఏంజెలెస్‌తో పాటూ కార్చిచ్చకు బలైన కౌంటీలకు ఆరు నెలల వరకు సహాయం చేస్తామని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. ఇవి పూర్తిగా కోలుకుని ప్రస్తుత పరిస్థితి నుంచి బయటడేంతవరకు అన్నీ చూసుకుంటామని తెలిపారు. 

Also Read: Kamala Jobs: స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చిన భార్య..కుదుటపడిన ఆమె ఆరోగ్యం

 

ఫాస్ చెక్...

 వైల్డ్ ఫైర్ ఆర్పేందుకు పింక్ ఫైర్ రిటార్డెంట్ అయిన ఫాస్ చెక్‌ను అక్కడి అగ్నిమాపక సిబ్బంది ఎక్కువగా ఉపయోగించారు. నీరు, ఎరువుల లవణాలు, తుప్పు నిరోధకాలతో కూడిన ఫాస్ చెక్ ఇంధనాలను చల్లబరిచి.. మంటలను తగ్గిస్తుంది. ప్రస్తుతానికి ఇది ప్రభావ వంతంగానే కనిపిస్తోంది దీని వలన చాలా ప్రాంతాలో మంటలు నెమ్మదించాయి. ఇది అమ్మోనియం ఫాస్ఫేట్‌తో తయారు చేయబడింది. ఇది చాలా కాలం పాటు ప్రభావవంతంగా ఉంటుంది. త్వరగా ఆవిరైపోదు.ఈ పొర ఆక్సిజన్ సరఫరాను అడ్డుకోవడం ద్వారా మంటల వ్యాప్తిని తగ్గిస్తుంది.

usa
Wild Fire, Phos Check

 

అయితే దీనివలన పర్యావరణ ముప్పు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2024లో దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఫాస్-చెక్‌లో క్రోమియం, కాడ్మియం వంటి విషపూరిత లోహాలు ఉన్నాయని తేలింది. ఇవి క్యాన్సర్, మూత్రపిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి. ఈ రసాయనాలు నదులు, సముద్రాల్లో పడితే.. అవి జలచరాలకు కూడా ప్రాణాంతకంగా మారతాయని తెలిపారు.  ప్రాణాంతకం కావచ్చు. 

us
Phos Chek

 Also Read: KTR: ఈరోజు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

 

Advertisment
Advertisment
తాజా కథనాలు