USA: లాస్ ఏంజెల్స్ ఉత్తరాన కొత్త మంటలు..ఇళ్ళను వదిలిపెట్టిన 31వేల మంది..

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఉత్తరాన కొత్త మంటలు వ్యాపించాయి.  అక్కడి శాంటా క్లారిటీ వ్యాలీలో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో దాదాపు 31 వేల మంది ఇళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది. శాంటా ఆనా పొడిగాలుల కారణంగా మంటలు చెలరేగాయి.

New Update
wildfire

wildfire Photograph: (wildfire)

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కార్జిచ్చు ఎంతటి నష్టాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. దాని వలన ఎన్ని వేల మంది రోడ్డున పడ్డారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆ బాధ నుంచి తేరుకోనే లేదు. ఇంకా చాలా మంది వెనక్కు రాలేదు. లాస్ ఏంజెల్స్ ను మళ్ళీ మంటలు చుట్టుముట్టాయి. ఈ సారి నగరానికి ఉత్తరాన కాచ్చిచ్చు వ్యాపిస్తోంది. లాస్ ఏంజెల్స్ లో నార్త్ లో ఉన్న శాంటా క్లారిటీ వ్యాలీలో మంటలు పెరుగుతున్నాయి. కాస్టాయిక్ సరస్సు సమీపంలోని కొండలలో అగ్నిప్రమాదం భయంకరమైన జ్వాలలు వ్యాపిస్తున్నాయి. రెండు గంటల్లోనే మంటలు 5,000 ఎకరాలకు వ్యాపించాయి. శాంటా ఆనా పొడిగాలుల కారణంగా కార్చిచ్చు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మంటల కారణంగా దాదాపు 31 వేలమంది తమ ఇళ్ళను వదిలిపెట్టి ఖాళీచేయాల్సి వచ్చింది. 

Also Read: USA: భారత ఐటీకి ఏం కాదు..నాస్కామ్

మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం..

శాంటా క్లారిటాలో మంటలను అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగింది. హెలికాఫ్టర్ల నుంచి నీటి కుమ్మరిస్తున్నారు. 2 సూపర్ స్కూపర్లు కూడా ఆగకుండా పని చేస్తున్నాయి.అలాగే ఒకేసారి వందల లీటర్ల నీటిని నింపగల పెద్ద విమానం ద్వారా కూడా మంటలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలిసేడ్స్ లో జరిగిన నష్టం ఇక్కడ జరగకుండా ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది.  లాస్ ఏంజిల్స్ కౌంటీ అగ్నిమాపక విభాగం, ఏంజిల్స్ నేషనల్ ఫారెస్ట్ ఫైర్ డిపార్ట్‌మెంట్ కూడా మంటలను అదుపు చేయడానికి కృషి చేస్తున్నాయి.

Also Read: CM Chandra Babu: వారసత్వం వల్ల ఏమీ అవదు..సీఎం చంద్రబాబు

Advertisment
తాజా కథనాలు