California Wild Fire: కాలిఫోర్నియా వాసులకు ఓ గుడ్ న్యూస్.. మరో షాకింగ్ న్యూస్..!

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ లోని వేల భవనాలు, భారీ విస్తీర్ణంలో అడవులు కార్చిచ్చుకు కాలి బూడిదై పోతున్నాయి. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ వరుణుడు కరుణించాడు.

New Update
california

california

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ లోని వేల భవనాలు, భారీ విస్తీర్ణంలో అడవులు కార్చిచ్చుకు కాలి బూడిదై పోతున్నాయి. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ వరుణుడు కరుణించాడు. కార్చిచ్చు ప్రభావిత దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్‌ లో తొలి వర్షం నమోదైంది.

Also Read: Bangladesh: జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు?

కొత్తగా మంటలు చెలరేగకుండా ఇది దోహదం చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కాలిపోయిన కొండప్రాంతాల నుంచి వచ్చే విషపూరిత బూడిద ప్రవాహం కొత్త సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదముందనే ఆందోళన మొదలైంది. అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో వృక్షాలను తొలగించడం , ధ్వంసమైన రోడ్లను బాగు చేయడం వంటి పనుల్లో లాస్‌ ఏంజెలెస్ కౌంటీ సిబ్బంది నిమగ్నమయ్యారు.

ఇదే సమయంలో ఈ ప్రాంతంలో వర్షం కురవనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో శనివారం రాత్రి చిన్నపాటి వర్షం మొదలుకాగా..మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిణామంతో కొన్ని వారాలుగా ఉక్కిరిబిక్కిరి అవుతోన్న అనేక ప్రాంతాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

Also Read: Mauni Amavasya: మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు

శిథిలాలు, బూడిద...

మరో వైపు కొండ ప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్స్‌ సంభవిస్తే శిథిలాలు, బూడిద వంటివి దిగువ ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని, ఇందుకోసం సంసిద్ధంగా ఉండాలని నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ వెల్లడించింది. ముఖ్యంగా కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బ్యాటరీలు, భవన నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్లతో పాటు ఇతర వస్తువుల్లో ఉండే రసాయన పదార్థాలు, అస్బెస్టాస్‌, ప్లాస్టిక్‌, సీసం వంటివి పర్యావరణం పై తీవ్ర ప్రభావం చూపనున్నాయనే ఆందోళన మొదలైంది.

దీంతో ఈ కాలుష్య కారకాల ప్రభావాన్ని తగ్గించేందుకు స్థానిక ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్దమైంది. 

Also Read: Hyderabad: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు... ఆ సినిమా ప్రేరణతోనే హత్య!

Also Read: Suryapet Incident: సూర్యాపేటలో పరువు హత్య.. ప్రేమించాడని వెంటపడి.. రాళ్లతో కొట్టి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు