/rtv/media/media_files/2025/01/12/ZUMBUSUTNcPdO21AGIP3.jpg)
LA Wild Fire
లాస్ ఏంజెలెస్‌లో ఇంకా అగ్నికి ఆహుతి అవుతూనే ఉంది. గాలుల వేగం తగ్గకపోవడం వలన ఇద మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికి 39 వేల ఎరకాలు తగలడిపోయింది. మరింత వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు పాలిసాడ్స్‌లో 23,707 ఎకరాలు, ఏటోన్‌లో 14,117 ఎకరాలు, కెన్నెత్‌లో 1,052 ఎకరాలు, హుర్సెట్‌లో 779 ఎకరాలుకాలా బూడిద అయ్యాయి.మొత్తం 12,000 నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 160 చదరపు కిలోమీటర్లు అగ్నికి ఆహుతి అయింది. మరోవైపు ఈ కార్చిచ్చకు ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 24కు చేరుకుంది. ఈసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొన్నిచోట్ల గాలుల తీవ్రత తగ్గింది. దీంతో ఆ ప్రాంతాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. ఖాళీచేసిన ప్రాంతాలకు తిరిగి చేరేందుకు కొందరు పౌరులను అనుమతించారు. పాలిసాడ్స్, ఏటోన్ ప్రాంతాల్లో వ్యాపించిన మంటలను మాత్రం పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోతున్నారు. మంటను వ్యాపించకుండా ఉండానికి కొన్ని రసాయనాలు కలిపిన ఫోస్ చెక్ అనే పదార్ధాన్ని వెదజ్లుతున్నారు. సుమారు 9 విమానాలు, 20 హెలికాఫ్టర్లు ఇదే పని మీద ఉన్నాయి. గులాబీ రంగులో ఉన్న ఆ పదార్థం అక్కడి నిర్మాణాలు, మొక్కలపైనా పడి అగ్నికీలల వ్యాప్తిని నెమ్మదింపజేస్తోంది.
మంటల వెనుక కారణం...
లాస్ ఏంజెలెస్‌లో మంటలు వ్యాపించడానికి కారణాన్ని అక్కడి అధికారులు ప్రయత్నిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో కాల్చిన బాణాసంచా వల్లనే దావాగ్ని మొదలయిందనే దిశగా పరిశోధనలు జరుపుతున్నారు. ఉపగ్రహ చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికులతో దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. న్యూ ఇయర్ రోజున లాస్ ఏంజెలెస్‌లో ఒకచోట మంట అంటుకుందని..దానిని అగ్నిమాపక సిబ్బంది ఆర్పారని స్థానికులు చెబుతున్నారు. ఉపగ్రహ చిత్రాలు ద్వారా ప్యాచ్ లాంటి జాగాను కూడా కనుగొన్నారు. అయితే ఈ కారణాన్ని అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు. మరింత పరిశోధన చేసిన తర్వాతనే చెప్పగలమని అంటున్నారు.
Also Read: Stock Market: పండగ పూట మంచి ఊపులో స్టాక్ మార్కెట్