USA: అమెరికాలో మరోసారి రాజుకున్న కార్చిచ్చు

దక్షిణ కాలిఫోర్నియాలో మరోసారి మంటలు చెలరేగాయి. 8వేల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఒక్క రోజులోనే 41 చ.కి.మీ. విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. 

New Update
Wild Fire

LA Wild Fire

కాలిఫోర్నియాపై కార్చిచ్చు పగ బట్టింది. ఒకచోట తగ్గితే మరోచోట మొదలవుతున్నాయి. దాదాపు 20 రోజులుగా ఎక్కడో ఒకచోట తగలబడుతూనే ఉంది. దాదాపు లాస్ ఏంజెలెస్ అంతా అగ్నికి ఆహుతి అయిపోయింది. రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ ను మళ్ళీ మంటలు చుట్టుముట్టాయి. ఈ సారి నగరానికి ఉత్తరాన కాచ్చిచ్చు వ్యాపిస్తోంది. లాస్ ఏంజెల్స్ లో నార్త్ లో ఉన్న శాంటా క్లారిటీ వ్యాలీలో మంటలు పెరుగుతున్నాయి. కాస్టాయిక్ సరస్సు సమీపంలోని కొండలలో అగ్నిప్రమాదం భయంకరమైన జ్వాలలు వ్యాపిస్తున్నాయి. రెండు గంటల్లోనే మంటలు 5,000 ఎకరాలకు వ్యాపించాయి. శాంటా ఆనా పొడిగాలుల కారణంగా కార్చిచ్చు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మంటల కారణంగా దాదాపు 31 వేలమంది తమ ఇళ్ళను వదిలిపెట్టి ఖాళీచేయాల్సి వచ్చింది.

దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 

ఇప్పుడు దక్షిణ కాలిఫోర్నియాను కూడా మంటలు చుట్టుమట్టాయి. 8వేల ఎకరాల్లో కార్చిచ్చు వ్యాపించింది. ఒక్క రోజులోనే 41 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన మంటలు అక్కడి ప్రదేశాన్ని అంతా ఆహుతి చేశాయి. దీని ప్రభావం చుట్టుపక్కల ప్రదేశాలపై కూడా పడుతోంది. దీంతో అక్కడ ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న కాలిఫోర్నియా స్టేట్‌ విశ్వవిద్యాలయాన్ని కూడా ఖాళీ చేయించారు అధికారులు. సుమారు 7వేల మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కార్చిచ్చుకు ద హ్యూజెస్‌ ఫైర్‌ అని పేరు పెట్టారు. ఇప్పటికే లాస్ ఏంజిలిస్‌లో పెను విషాదాన్ని మిగిల్చిన కార్చిచ్చు--తాజాగా చెలరేగిన మంటలతో మరింత నష్టం వాటిల్లనుంది. 

మరోవైపు లాస్‌ ఏంజెలెస్‌లో  మంటలకు ఆహుతైన పలు ప్రాంతాలను ట్రంప్ ఈ రోజు పరిశీలించారు. అక్కడి గవర్నర్‌ గవిన్‌న్యూసమ్‌తో భేటీ అయి..  సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో లాస్ ఏంజెలెస్ కు అండగా నిలబడతామన్నారు ట్రంప్. తమ ప్రభుత్వం రాష్ట్రానికి 100 శాతం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. 

Also Read: USA: తహవూర్ రాణాను అప్పగించేందుకు ఒప్పుకున్న అమెరికా సుప్రీంకోర్టు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు