/rtv/media/media_files/2025/09/13/wife-kills-husnband-2025-09-13-08-10-42.jpg)
wife kills husnband
Wife Kills Husband : వన్యప్రాణుల దాడిలో మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే పరిహారం దక్కుతుందన్న ఆశతో కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. . ఆ తరువాత పులి దాడి కథను సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడటంతో ఆమె ఫన్నాగం విఫలమైంది. ఈ దిగ్భ్రాంతికర ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. మైసూరు జిల్లా హుణసూరు తాలూకా చిక్కహెజ్జూరుకు చెందిన వెంకటస్వామి (54)ని ఆయన భార్య సల్లాపురి దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఊరి శివారులో, అటవీ ప్రాంతానికి సమీపంలో పెంటకుప్పలో మృతదేహాన్ని పారేసింది. తన భర్త కనిపించకుండా పోయాడని, పొలానికి వెళ్లిన సమయంలో పులి లాక్కొని వెళ్లి ఉంటుందని అనుమానాన్ని వ్యక్తం చేస్తూ రెండు రోజుల కిందట హుణసూరు గ్రామీణ ఠాణాలో, అటవీ శాఖ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేసింది.
Also Read : Faria Abdullah: దేవకన్యలా ముస్తాబైన ఫరియా.. ఫొటోలు చూస్తే.. వావ్ అనాల్సిందే!
వివరాల ప్రకారం, వెంకటస్వామి (45), సల్లాపురి దంపతులు స్థానికంగా పోక తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వీరి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. ఇదే అదనుగా భావించిన సల్లాపురి, తన భర్తను హత్య చేసి పరిహారం పొందాలని పథకం రచించింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేసి ఇంటి వెనుక పెంటకుప్పలో దాచి పెట్టింది అనంతరం, తన భర్త కనిపించడం లేదని, పులి దాడి చేసి లాక్కెళ్లిపోయి ఉండవచ్చని ఆమె అందరినీ నమ్మించింది. దీంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం పడుతుండటంతో వారికి పులి అడుగుజాడలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు, ఆమె ఇంటి పరిసరాల్లోనే వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటి వెనుక ఉన్న పేడకుప్పలో వెంకటస్వామి మృతదేహాన్ని గుర్తించారు.
Also Read : Faria Abdullah: దేవకన్యలా ముస్తాబైన ఫరియా.. ఫొటోలు చూస్తే.. వావ్ అనాల్సిందే!
మృతదేహం దొరకడంతో పోలీసులు సల్లాపురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం అంగీకరించింది. వన్యప్రాణుల దాడిలో చనిపోతే ప్రభుత్వం రూ. 15 లక్షలు పరిహారంగా ఇస్తుందని పోక తోటలో పనిచేస్తున్నప్పుడు ఎవరో మాట్లాడుకోగా విన్నానని, ఆ డబ్బుల కోసమే ఈ హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. ఆహారంలో విషం కలిపి చంపేశాక, శవాన్ని పేడకుప్పలో దాచినట్లు వివరించింది. ఈ ఘటనపై హుణసూరు గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:సీబీఐకి ఫిర్యాదు చేస్తా.. BRS పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు