Meerpet Incident: భార్యను కుక్కర్‌లో ఉడికించిన ఘటన.. గురుమూర్తి సెల్‌ఫోన్‌లో సంచలన విషయం

మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా చేసిన ఘటనలో మరో సంచలన విషయం బయటపడింది. గురుమూర్తి సెల్‌ఫోన్‌ను మరో మహిళ ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళతో సంబంధం వల్లే భార్య అడ్డు తొలగిచేందుకు ఈ పనికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.

New Update
Guru Murthi and Venkata madhavi

Guru Murthi and Venkata madhavi

Meerpet Incident: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించిన ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భర్త గురుమూర్తికి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉండటం వల్లే భార్య వెంకట మాధవిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో విచారణలో భాగంగా గురుమూర్తి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పరిశీలించగా అందులో మరో మహిళ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు.  

Also Read:  ట్రంప్‌ నిర్ణయంతో అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతున్న ఇండియన్స్

మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించి..

ఆ మహిళతో అక్రమ సంబంధం వల్లే భార్య అడ్డు తొలగించుకునేందుకు ఇలా హతమార్చాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తి చెప్పిన వివరాలను బట్టి ఇంకా మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. జనవరి 15న గురుమూర్తికి తన భార్యకు వాగ్వాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వేరే మహిళకు సంబంధించిన విషయంలోనే వీళ్ల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతడు భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించాడు. ఆ తర్వాత వాటిని చెరువులో పారేశాడు. ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. 

Also Read :  GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!

జనవరి 18వ తేదీన మాధవి కనిపించడం లేదని, ఆమె తల్లి మీర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంట్లో గొడవ అయ్యి బయటకు వెళ్లిందని, మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. సినిమా నుంచి వచ్చిన తర్వాత మాధవి ఇంట్లోకి వెళ్లింది. కానీ తిరిగి బయటకు వెళ్లనట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కనీసం బయటకు వచ్చిందా అంటా అదీ లేదు. పోనీ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందా? అంటే అలా కూడా లేదు.

Also Read: ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తా.. కేజ్రీవాల్ సంచలన హామీ

దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. భర్త గురుమూర్తిని విచారించారు. ఈ క్రమంలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. భార్యను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. మటన్ కోసే కత్తితో ఆమెను దుంగపై ముక్కలుగా కోశాడు. వీటిని కుక్కర్‌లో వాటర్ లేకుండా చేశాడు. దాదాపుగా కొన్ని గంటల పాటు కుక్కర్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే హీటర్ ద్వారా కూడా మాంసాన్ని ఉడికించి, ఆ తర్వాత పొడి తయారు చేశాడు. దీన్ని ఇంటి దగ్గర ఉన్న చెరువులో పడేశాడు. ఈ విషయాలన్ని గురుమూర్తే విచారణలో అంగీకరించాడు. 

Also Read :  Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు