AP News: అయ్యో పాపం.. స్కూటీ పై వెళ్తుంటే చెట్టు విరిగి.. స్పాట్ డెడ్!
విశాఖపట్నం సీతమ్మధారలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూటీ మీద వెళ్తున్న మహిళ పై రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
విశాఖపట్నం సీతమ్మధారలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూటీ మీద వెళ్తున్న మహిళ పై రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్వేర్ దంపతులు ఉన్నారు. విశాఖకు చెందిన ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అనకాపల్లిలో విషాదం జరిగింది. భర్తతో బైక్ మీద ఆసుపత్రిగా వెళ్తుండగా రామదుర్గ మెడకు చున్నీ చుట్టుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. రామదుర్గకు 9 నెలల కిందటే వివాహం జరిగింది. అకాల మరణంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు స్పాట్లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్లో సిమెంట్ గోడ కూలింది.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో YCP గతంలో 58 స్థానాలను కైవసం చేసుకుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. అయితే.. ఇప్పుడు కూటమికి మేయర్ పదవి ఎలా వస్తుందని ప్రశ్నించారు.
ఏపీలో క్యాంపస్ పెట్టడానికి అతి పెద్ద టెక్ కంపెనీ ముందు వచ్చింది. మంత్ర లోకేశ్ చొరవతో విశాఖలో టీసీఎస్ రూ.1, 370 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. దీంతో విభజన తర్వాత ఏపీలో పెట్టబోతున్న అతిపెద్ద టెక్ సంస్థగా టీసీఎస్ నిలవనుంది.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.
వైజాగ్లో వైసీపీ నేత నరేంద్ర ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని కోసం నరేంద్ర పోలీస్ స్టేషన్కు రావడంతో ఆమె ఎస్సై ముందే చెప్పుతో దాడి చేసింది.