/rtv/media/media_files/2025/05/19/XIexQksh4yLwig9FDMq3.jpg)
Vizag Steel Plant
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్‌ను ఎస్‌ఎంఎస్‌కు తరలించేందుకు కార్‌లోకి (టీఎల్‌సీ) ద్రవ ఉక్కును నింపి ఏర్పాట్లు చేశారు. ఒక్కసారిగా టీఎల్‌సీకి రంధ్రం పడి ద్రవ ఉక్కు మొత్తం కూడా కింద పడింది. దాదాపుగా 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది. ఈ ప్రమాద ఘటనలో కేబుల్స్ కాలిపోయి, పూర్తిగా ట్రాక్ దెబ్బతింది.
ఇది కూడా చూడండి: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!
Vizag Steel Plant Accident
ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ మంటలను అదుపు చేసి ట్రాక్ మీద పడిన ఉక్కును తొలగించే పనులు స్టార్ట్ చేశారు. అయితే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!
ఇదిలా ఉండగా హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 చనిపోయారు. అయితే వీరు చనిపోవడానికి కారణం ఇంటి యజమాని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే అన్నారు. మొదట ఏసీ పేలడంతో ప్రమాదం జరిగిందని అంచనా వేసినా.. తర్వాత షార్ట్ సర్యూట్ కారణమని తెలిపారు. ఫైర్ ఎగ్జిస్ట్ లేకపోవడం, చెక్క ప్యానెళ్లు ఉండటం వల్లే ఈ ఘోరం జరిగిందని చెప్పారు.
ఇది కూడా చూడండి: Indian Army : సైన్యానికి కీలక అధికారులు..కేంద్రం నిర్ణయం
పెద్ద ఇంటికి ఒక్కటే దర్వాజ విశాలంగా ఉంది. లోపల చాలా ఇరుగ్గా ఉంది. మెట్లు కూడా సరిగ్గా లేవు. ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రలో ఉన్నారు. ఆ కారణంతోనే సరిగా బయటపడలేకపోయారు. షాక్ నుంచి తేరుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫైర్ ఎగ్జిస్ట్ లేని కారణంగానే ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు చిన్నారులు, మిగిలిన వారంతా పురుషులే ఉన్నారు
accident | steel-plant | vizag