kodali Nani : కొడాలి నానికి మరో బిగ్ షాక్.... పోలీసులు నోటీసులు

మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 2024లో అంజనా ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.

New Update
kodali nani

 వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై విశాఖ మరో కేసు నమోదు చేశారు. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 2024లో  ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనా ప్రియ అనే మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా, విశాఖపట్నం త్రీటౌన్ పోలీసులు ఐటీ చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కొడాలి నానిపై కేసు పెట్టారు. ఐటీ యాక్టు U/s 353(2), 352, 351(4) సెక్షన్ల కింద సి.ఐ రమణయ్య కేసు నమోదు చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు.  గతంలో కూడా కొడాలి నానిపై ఇలాంటి కేసులే నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలలో భాగంగా పెడుతున్నారని వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

మరిన్ని కేసులు 

ఎన్నికల సమయంలో కొడాలి నాని బలవంతంగా తమతో రాజీనామా చేయించారని ఆరోపిస్తూ గుడివాడలో పలువురు వార్డు వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా, గుడివాడ పోలీసులు ఆయనతో పాటు కొందరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొడాలి నానికి ముందస్తు బెయిల్ లభించింది. ఇక లిక్కర్ గోడౌన్ లైసెన్స్ కేసులో తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమయ్యారని ఆరోపిస్తూ దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి గుడివాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కొడాలి నాని, మరికొందరిపై 448, 427, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

గుడివాడలో ఓటమి తర్వాత

గుడివాడలో ఆయన ఓటమి తర్వాత బహిరంగంగా పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారి ఒకసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు, తన ఓటమికి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కారణమని విమర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్ర విమర్శలు, కేసుల నేపథ్యంలో కొంతకాలం సైలెంట్‌గా ఉండి, సరైన సమయం చూసి తిరిగి క్రియాశీలంగా మారాలని ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ అధినేత జగన్ తో ఆయనకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో ఆయన మళ్ళీ క్రియాశీలకంగా మారే అవకాశం ఉందని కార్యకర్తలు  భావిస్తున్నారు.

Also Read : BIG BREAKING : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి బాంబు బెదిరింపు!

Advertisment
తాజా కథనాలు