పెట్టుబడులు కోసమే అందాల పోటీలు | Kadiyam Shri Hari Comments On Miss World-2025 | CM Revanth | RTV
సింహాచలం గోడి కూలి 8 మంది స్పాట్లోనే మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షలు, బాధిత కుటుంబ సభ్యులకు దేవదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
విశాఖ బీచ్ రోడ్డులో లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో.. పక్కనే ఉన్న పార్కులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఏపీలో దారుణం జరిగింది. అనకాపల్లి జిల్లా డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న అట్టా ఝాన్సీ.. తన 6ఏళ్ల కొడుకుతో కలిసి ఏలేరు కాలువలో దూకడంతో ఇద్దరు చనిపోయారు. భర్త అచ్యుతరావు వేధింపులే కారణమని తేలడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫైన్ ఆర్ట్స్ విభాగంలో "Transformation of the Mediums in Indian Sculpture" అనే అంశంపై రవికుమార్ కొడాలికి డాక్టరేట్(పిహెచ్.డి) మంజూరైంది. ఆచార్య ఆదినారాయణ గారి పర్యవేక్షణలో చేసిన ఈ పరిశోధన కళా రంగంలో కీలక స్థానం సాదించింది.
విశాఖపట్నం జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగ్రాతులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.