/rtv/media/media_files/2025/08/19/vizag-2025-08-19-07-02-11.jpg)
మధురవాడ నేషనల్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో యువతి, యువకుడు మృతి చెందారు. పీఎంపాలెం పోలీసుస్టేషన్ సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసు పెద్ద కుమారుడైన సతీష్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం టైల్స్ పనికోసం కూలి పనులకు వెళ్తున్నాడు. అతనికి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి సతీష్‌తో పాటు తమ్ముడిని పెదనాన్న, చేపలుప్పాడలో ఉంటున్న అమ్మమ్మ కుటుంబం వాళ్లు పెంచి పెద్ద చేశారు. ఇక శ్రీకాకుళం జిల్లా(srikakulam) పలాసకు చెందిన రామారావు కుమార్తె ఎస్.ఉష (18) పదో తరగతి వరకు చదువుకుంది. కొద్ది రోజులుగా పరదేశిపాలెంలో గది అద్దెకు తీసుకుని స్థానికంగా ఉద్యోగం చేస్తానంటూ ఉంటుంది. ఈ క్రమంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడగా అది ప్రేమగా మారింది.
Also Read : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
రైల్వేస్టేషన్‌లో దింపాలని
అయితే సోమవారం సాయంత్రం తాను ఇంటికి వెళ్లున్నానని.. తనను రైల్వేస్టేషన్‌లో దింపాలని యువతి కోరింది. దీంతో సతీష్ బైకుపై ఇద్దరూ బయలుదేరారు. మధురవాడ వద్ద నేషనల్ హైవేపై చంద్రంపాలెం స్కూల్ వద్దకు వచ్చే సరికి లారీ, ప్రైవేటు ట్రావెల్ బస్సు పక్కపక్కగా వెళ్తున్నాయి. వాటిని క్రాస్ చేసి ముందుకు వెళ్లేందుకు సతీష్ ప్రయత్నించాడు. రెండు వాహనాల మధ్యగా పోనివ్వగడా బైకు అదుపుతప్పి లారీ కింద పడటంతో ఇరువురి తలలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై డి.రాము కేసు దర్యాప్తు చేస్తున్నారని సీఐ తెలిపారు. పిల్లలు చనిపోవడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also Read : పాపను కారుల్లో కూర్చొబెట్టి దర్శనానికి.. ఏం జరిగిందే..!!
తండ్రీ కొడుకులకు కరెంట్ షాక్
మరోవైపు మొక్కజొన్న చేనుకు రక్షణగా తీగ ఏర్పాటు చేసేందుకు వెళ్లిన తండ్రీ కొడుకులకు కరెంట్ షాక్ బలిగొంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. చంద్లాపూర్ గ్రామానికి చెందిన మూర్తి గజేందర్‌రెడ్డి(52)కి భార్య పద్మ, కుమారుడు రాజిరెడ్డి(25), కుమార్తె సంతోషి ఉన్నారు. మందపల్లి శివారులోని ఓ కంపెనీలో రాజిరెడ్డి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుండటంతోపాటు తండ్రికి సాగు పనుల్లో ఆసరాగా నిలుస్తున్నాడు. 2025 ఆగస్టు 14వతేదీన సంతోషికి పెళ్లి చేశారు. తండ్రీ కొడుకులు సోమవారం అడవి పందులు నుంచి రక్షణగా ఉండేందుకు తమ పంట పొలం చుట్టూ తీగ బిగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తీగ తగిలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : Dharmasthala Case : ధర్మస్థల పుర్రెల కేసులో బిగ్ ట్విస్ట్.. మాట మార్చిన ముసుగు మనిషి