Telangana : నకిలీ విత్తనాల గుట్టు రట్టు.. అదుపులో ఇద్దరు నిందితులు!
Cotton Seeds : తెలంగాణలో నకిలీ విత్తనాలు దొరకడం కలకలం రేపింది.
Cotton Seeds : తెలంగాణలో నకిలీ విత్తనాలు దొరకడం కలకలం రేపింది.
తాండూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితులకు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు వినూత్న రీతిలో శిక్ష విధించింది. జరిమానాతో పాటు ₹1000 పండ్లు కొనుగోలు చేసి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు అందజేయాలని తీర్పు ఇచ్చింది. నలుగురు నిందితులు 30 మంది రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన దయ్యాల తరుణ్ సివిల్స్ లో 231 ర్యాంకు సాధించాడు. తరుణ్ తల్లిదండ్రులు కూలీపనులు చేస్తూ కొడుకును చదివించారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరుణ్..నగరంలోనే ఉన్నవిద్యను కూడా పూర్తి చేశారు.
వికారాబాద్ మహిళ మర్డర్ కేసులో చిక్కుముడి వీడింది. మృతురాలు చేవేళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం హంతకుడు ఆమెను చీర కొంగును మెడకు కట్టి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు నిందితుడు రామస్వామి. ఇతను సీరియల్ కిల్లర్ అని తెలుస్తోంది.
వికారాబాద్‌లో రేసింగ్‌ల రచ్చ చేస్తున్నారు. అనంతగిరి కొండల్లో జోరుగా కార్, బైక్ రేసింగ్‌లతో దుమ్ము రేపుతున్నారు రేసింగ్ రాయుళ్లు. అడవుల్లోకి వాహనాలకు అనుమతి లేకున్నా ..డబ్బులు తీసుకొని అటవీశాఖ అధికారులే వదిలేశారని ఆరోపణ చేస్తున్నారు. రేసింగ్‌లతో స్థానికులు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉద్యోగం ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్‌లో తాను ఎమ్మార్వోగా ఉద్యోగం చేస్తున్నట్లు.. తమ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉన్నట్లు మాయ మాటలు చెప్పి దంపతుల నుంచి లక్ష 50 వేల వసూళ్లు చేసిననట్లు తెలిపారు. నిందితురాలి నుంచి నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నరసింహులు వెల్లడించారు. రాష్ట్రంలో నకిలీ ఉద్యోగులు పెరిగిపోతున్నారు. తాను ఈ శాఖ, ఆ శాఖలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకుంటూ తమకు ఇంత ఇస్తే తాము ఉద్యోగం ఇప్పిస్తామని అమాయకుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. అలాంటి ఘటనే వికారాబాద్‌లో జరిగింది