ఉద్యోగం ఇప్పిస్తానని దంపతులను మోసం చేసిన కిలాడీ అరెస్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్‌లో తాను ఎమ్మార్వోగా ఉద్యోగం చేస్తున్నట్లు.. తమ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉన్నట్లు మాయ మాటలు చెప్పి దంపతుల నుంచి లక్ష 50 వేల వసూళ్లు చేసిననట్లు తెలిపారు. నిందితురాలి నుంచి నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నరసింహులు వెల్లడించారు. రాష్ట్రంలో నకిలీ ఉద్యోగులు పెరిగిపోతున్నారు. తాను ఈ శాఖ, ఆ శాఖలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకుంటూ తమకు ఇంత ఇస్తే తాము ఉద్యోగం ఇప్పిస్తామని అమాయకుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. అలాంటి ఘటనే వికారాబాద్‌లో జరిగింది By Karthik 02 Aug 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని భార్యా భర్తలను మోసం చేసిన కిలాడీని వికారాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నరసింహులు అన్నారు. నిందితురాలు మంచిర్యాల జిల్లాకు చెందిన గోమాస శిరీష అలియాస్ అనూష ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటూ, వికారాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉందని, మౌలాలికి చెందిన దంపతులు వాణిరెడ్డి, కృష్ణారెడ్డికి మాయమాటలు చెప్పి యువతి వారి నుంచి లక్ష 50 వేలు వసూళ్లు చేసిందన్నారు. బాధితులు డబ్బులు ఇచ్చాక వారికి నకిలీ ఆర్డర్ కాపీని సైతం అందిచినట్లు వెల్లడించారు. Your browser does not support the video tag. ఆర్డర్ కాపీలో వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటుపై అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు డీఎస్పీ నరసింహులు తెలిపారు. యువతి ఇచ్చిన ఆర్డర్ కాపీ నకిలీదని తెలియడంతో తాము మోసపోయామని గ్రహించిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని, యువతి నుంచి నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. Your browser does not support the video tag. నిందితురాలిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మరోవైపు నిందితురాలు అనూష ఇంకెక్కడైనా ఇలాంటి మోసాలకు పాల్పడిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. #fake-job #vikarabad #dsp #anusha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి