Telangana:వీడిన వికారాబాద్ మర్డర్ మిస్టరీ..వెలుగులోకి సంచలన విషయాలు వికారాబాద్ మహిళ మర్డర్ కేసులో చిక్కుముడి వీడింది. మృతురాలు చేవేళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం హంతకుడు ఆమెను చీర కొంగును మెడకు కట్టి, ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు నిందితుడు రామస్వామి. ఇతను సీరియల్ కిల్లర్ అని తెలుస్తోంది. By Manogna alamuru 19 Jan 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Vikarabad Murder:వికారాబాద్ హత్య కేసు మిస్టరీ వీడింది. చనిపోయిన మహిళ ఎవరు, చంపింది ఎవరు అనే విషయాన్ని పోలీసులు సక్సెస్ఫుల్గా ఛేదించారు. చేవెళ్ళకు చెందిన అనసూయ అనే ఆమెను వికారాబాద్ అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ముందు చీర కొంగుతో మెడకు ఉరి బిగించి చంపేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. నాలుగు రోజుల కిందట హత్య చేసాడని పోలీసులు చెబుతున్నారు. హత్య చేసింది సీరియల్ కిల్లర్ రామస్వామి అని గుర్తించామని తెలిపారు. ఇతను ఇంతకుముందు ఐదు మర్డర్లు చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇతనికి బాబు అనే ఇంకో పేరు కూడా ఉంది. ముందుగా ఆడవారితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం...ఆ తర్వాత వారిని హత్య చేయడం రామస్వామి అలవాటని పోలీసులు చెబుతున్నారు. Also Read:భారత్, మాల్దీవుల విదేశాంగ మంత్రుల మధ్య కీలక చర్చ.. బాబుని ఊరినుంచి వెళ్ళగొట్టారు... అంతకు ముందు కూడా రామస్వామి మీద చాలా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్రైమ్ హిస్టరీని బయటకు తీస్తున్నారు. ఇంతకు ముందు కూడా రామస్వామి ఒకసారి జైలుకు వెళ్ళాడు. గ్రామంలో ఒక బాలుడిని హత్య చేసినందుకు ఊరి నించి కూడా వెళ్ళగొట్టారు. తరువాత జైలు నుంచి విడుదల అయ్యాక రామస్వామి వరుస హత్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. అనంతగిరి గుడిలో ఇతను దొంగతనాలు కూడా చేనట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. ఒంటరి మహిళలే టార్గెట్... నిందితుడు రామస్వామి టార్గెట్ ఎప్పుడూ ఒంటరి మహిళలే. ముందు ఒంటరిగా ఉన్న ఆడవాళ్లను ఎంచుకుని వారితో కొన్ని రోజులు అక్రమ సంబంధాలను పెట్టుకొనేవాడు. కొద్దిరోజులు వారితో మంచిగా ఉండి...వారిని నమ్మించేవాడు. ఆ తరువాత మోజు తీరాక వారిని అడవుల్లోకి తీసుకెళ్ళి హత్యలు చేశాడు. ఇలా మొత్తం ఇప్పటికి ఐదుగురిని హత్య చేశాడు రామస్వామి. గతంలో ఇతను ఒక మహిళను ఇలాగే చంపి తలను, మొండేన్ని వేరు వేరుగా పాతిపెట్టాడని పోలీసులు చెబుతున్నారు. #telangana #murder #woman #vikarabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి