Madhya Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే ఫ్యామిలీలో ఎనిమిది మంది మృతి!
మధ్యప్రదేశ్లోని దామో జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. నోహటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.