/rtv/media/media_files/2025/01/16/ILT9bShUxGD2rCDJwWD4.jpg)
karnataka Photograph: (karnataka)
Robbery: దారి దోపిడి దొంగలు దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా ATMలో డబ్బులు వేసే వాహనాన్ని టార్గెట్ చేసి భారీ నగదు దోచేశారు. డబ్బే లక్ష్యంగా వెహికిల్‌పై విచక్షణ రహితంగా దుండగులు కాల్పులు జరపడంతో సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలవగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టపగలే దారి దోపిడీ..
కర్నాటకలోని బీదర్ నగరంలో పట్టపగలు దొంగల ముఠా ఈ దారుణానికి పాల్పడింది. బీదర్ నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ ఎదుట వెహికిల్ పై కాల్పులు జరిపారు. కొద్ది రోజులుగా ఆ వాహనం తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తున్న దొంగలు.. బీదర్‌లో మకాం వేశారు. వెహికల్ రావడంతో అటాక్ చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వాళ్లను నిలువరించేందుకు ప్రయత్నించారు. కానీ దుండగులు ముందుగా కారంపొడి చల్లి తుపాకులతో కాల్పులు జరిపారు.
ఇది కూడా చదవండి: Kumbh melaపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు.. సీఎం వార్నింగ్
గార్డు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా మరో గార్డు శివకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శివకుమార్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దొంగలు నగదు పెట్టెతో పారిపోగా అందులో రూ.93 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Saif Ali khan: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే